Wednesday, March 17, 2021

నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు గారి వివరాలు

నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన

రాయప్రోలు సుబ్బారావు గారి వివరాలు 



రాయప్రోలు సుబ్బారావు గారు 

నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు (మార్చి 171892 - జూన్ 301984) తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు. ఈయన 1913లో వ్రాసిన తృణకంకణముతో తెలుగు కవిత్వములో నూతన శకము ఆరంభమైనదని అంటారు. ఇందులో ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్ళికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో ఖండకావ్య ప్రక్రియకు అంకురార్పణ చేశాడు. భావకవుల్లో కూడా కొందరు ఆద్యులు, కొందరు ఆఢ్యులు. రాయప్రోలు సుబ్బారావు గారు నిస్సందేహంగా ఆద్యులే.  భావకవిత్వం ప్రాచుర్యం పొందడానికి వ్యాసముద్రణలు కాదు. శ్రోతలముందు భావకవితాపఠనం ముఖ్యం. 

  • సుబ్బారావుగారు మెట్రిక్ దాకా చదివి, ముందుకు కొనసాగించలేని పరిస్థితుల్లో రాజమండ్రి చిలుకూరు వీరభద్రరావు సంపాదకత్వంలోని 'ఆంధ్రకేసరీ పత్రికలో రచనలుచేయడం, అజ్ఞాతసంపాదకుడి విధులు, మేనమామతో ఆశు కవితాజంటవిన్యాసాలు స్వత:రసదృష్టి పెరిగినా, ఆశుకవితలమీద వెగటుతనం ఆవహించి, వాటిపై సన్యాసందాకా పోయింది.

  • న్యాయవాది గంటిలక్ష్మన్నపంతులు ప్రోద్బలంతో ఆంగ్లకవి 'గోల్డ్ స్మిత్ - హెర్మిట్' కౄతిని 'లలితా(1909)గా, టెన్నిసన్క్ రచన - 'డోరా'ను 'అనుమతీ(1910) లఘుకావ్యంగాను, 'తృణకంకణం'(1912) నూతనరచనలను సౄష్టించాలని సంకల్పంతోనే ఆశుకవిత్వానికి వీడుకోలు పలకవలసి వచ్చింది.

  • మదరాసు చేరుకుని, కొమర్రాజు వారి దగ్గర 'విజ్ణానచంద్రికాగ్రంధమండలీ, 'ఆంధ్రవిజ్ణానసర్వస్వం' లో లేఖకునిగా ఉద్యోగం చేశారు.

  • విశిష్టకవిత్వానికి అనాదరణ ఆనాటి నుంచే మొదలైంది. ఆధునిక కవిత్వరచనలు చేస్తున్నా కూడ, రాయప్రోలు వారి 'కొత్తపోకడలు" లోకం గుర్తింపుకు నోచుకోలేదు.  వీరి కావ్యాలు మొదటదశలో ఎవరి దౄష్టిని ఆకర్షించలేదు. 

  • కవితలు, కావ్యాలు వ్రాస్తున్నా, ఆనాడు అధికంగా వ్యాప్తి వున్న వరకట్నం దురాచారాన్ని భరించలేకపోయారు.

  • ప్రత్యక్ష ఘటన, బ్రాహ్మణయువతి 'స్నేహలత" స్వయంకృతంగా అగ్నిజ్వాలకు ఆహుతికావడం అనేక కవులకు ప్రేరణ కలిగించింది.

  • ఈ ఇతి వృత్తంతో నవీనశైలితో  పద్యకావ్యం  రాయప్రోలుకు కలిగిన నూతన దృ ష్టితో వంగదేశం వలసపోయారు.

  • విశ్వకవి రవీంద్రుని అంతేవాసితనం, సాహిత్యసౌందర్యాలను స్వంతంచేసుకుని, స్వదేశం వచ్చారు.

  • కాల్పనికకవిత్వం, జాతీయోద్యమం, ఆంధ్రోద్యమంతో ప్రభావంచెంది, 'ఆంధ్రావళీ అవతరణకు దారితీసింది.

  • ఈ ప్రభావం, రామమోహన గ్రంధాలయంలో (1916) 'హౄదయములను చేల్చి చదవమనీ సదయులందరికి సందేశాన్నిచ్చారు.

తెలుగు సాహిత్య యుగకర్త


తెలుగుసేమలోని విద్యావంతులు బెంగాలులో వన్నెలుపోతున్న భావచైతన్యం వల్ల ప్రభావితమవుతున్న కాలంలో, తమ మాతౄభాషలో తోటివారికోసం సంకల్పించిన పధం నిర్మిస్తున్న కాలమది. సాహితీభాషామూర్తులు అనుకున్నది సాథించడానికి దారులు తమరే పరచుకుంటున్న పవిత్ర సాహితీపథాలవి. యిరవయ్యవ శతాబ్దపు చివరి దశకకాలం. 1891-92 సంవత్సరం. భావిభారత నవ్యాంధ్ర సాహితీముర్తిత్వానికి సంకేతంగా గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో ఒక మాతౄమూర్తి పురుడుపోసుకుని పుత్రున్ని కన్నది. అది రాయప్రోలు వారి వంశం. పసివాడి పేరు వేంకటసుబ్బారావు. వారి కవిత్వాన్ని, ప్రక్రియని ఒక రకమైన 'సాహితీయుగం - యుగకర్త గా చెలామణి కావడాన్ని బట్టి రాయప్రోలు వారికి సరిసములను కష్టపడి పట్టుకోవాలి.

 


అది 1916 సంక్రాంతిపండుగ. బెజవాడ రామమోహనగ్రంధాలయపు ఆవరణలో జరుగుతున్న మహోత్సవ సభ. నిండుసభలో ఆంధ్రాభిమానపూరితమైన పద్యలహరిని శ్రావ్యభరితంగా గానంచేసిన వ్యక్తి రాయప్రోలు సుబ్బారావు . ఆ పద్యాల్లో, తెనుగువాణి వర్ధిల్లింది. తెనుగుకత్తి మెరసింది.  తెనుగురేఖ అలరింది. తెనుగుభూమి యావత్తు వసుంధరనే సస్యశ్యామలభరితంకావించింది. 'చావలేదు, చావలేదు, ఆంధ్రుల మహోజ్జ్వల చరిత్ర" హౄదయములు చీల్చి చదువుడో సదయులారా అని సాహితీసందేశాన్నిచ్చాడు.


రాయప్రోలు సుబ్బారావు  గారిది ది గ్రుడ్డి అనుకరణ కాదు. తెలుగు, సంస్కృత భాషా పటిమను ఆయన విడలేదు. మన సమాజానికి అనుగుణంగా భావుకతను అల్లి తెలుగు కవితకు క్రొత్త సొగసులు అద్దాడు. రాయప్రోలు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాని. ఆయన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి. వ్యక్తిగతంగా మాత్రం కవిత్వంలో వ్రాసిన దేశభక్తికి ఫక్తు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి రాయప్రోలు.


రాయప్రోలు సుబ్బారావు మొదటి చూపులోనే చూపరులను ఆకట్టుకుంటారని ప్రతీ తి. తమ బెట్టుతో, బింకంతో, ఠీవితో, పల్లెవాటుల వయ్యారంతో, చెక్కుచెదరని క్రాఫింగ్‌తో నిండుగా ఉండేవారు. ఐతే ఒక పక్క కవిత్వంలో మన వంటి ధీరులింకెందునూ లేరని, ఏదేశమేగినా జాతిగౌరవం నిలపాలని వ్రాస్తూనే, మరొక పక్క తెలంగాణలో ప్రజలు రాజ్యంతో వీరోచితంగా పోరాడుతూండగా నైజాం రాజ్యాన్ని పొగుడుతూ రగడ రచించారన్న పేరు మూటకట్టుకున్నారు. 


వారిని గురించి రాస్తూ ఆంధ్రపత్రికలో సాహిత్యంలో కట్టలు తెంచుకుని మరవపారిన వీరి దేశభక్తి నిత్యజీవితాన్ని ముట్టనయినా ముట్టలేదు. ‘అవమానమేలరా అనుమానమేల, భరతపుత్రుడనంచు భక్తితో పలుక’ అని ప్రశ్నించి, ‘కంకణ విసర్జనకిది కాలమగునె’ అని హెచ్చరించిన వీరు జాతీయోద్యమం ముమ్మరమై నిజాం నవాబు తఖ్తు పునాదులు ఊగిసలాడే వేళకు, దీక్షాకంకణం తృణకంకణంలాగ విదిల్చివేశారు. వీరు పదవికి, పలుకులకు తగినంతగా ప్రజాహితమేమీ చేయలేదనే ప్రవాదమూ ఉంది. అని వ్రాశారు....


అవమానమేలరా అనుమానమేల, భరతపుత్రుడనంచు భక్తితో పలుక’ అని ప్రశ్నించి, ‘కంకణ విసర్జనకిది కాలమగునె’ అని హెచ్చరించిన వీరు జాతీయోద్యమం ముమ్మరమై నిజాం నవాబు తఖ్తు పునాదులు ఊగిసలాడే వేళకు, దీక్షాకంకణం తృణకంకణంలాగ విదిల్చివేశారు. వీరు పదవికి, పలుకులకు తగినంతగా ప్రజాహితమేమీ చేయలేదనే ప్రతి  వాదమూ ఉంది. అని వ్రాశారు.


కొన్ని మచ్చు  తునకలు 


ఏ దేశమేగినా ఎందుకాలిడినా

ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన

పొగడరా నీ తల్లి భూమి భారతిని

నిలుపరా నీ జాతి నిండు గౌరవము

శ్రీలు పొంగిన జీవగడ్డయి

పాలు పారిన భాగ్యసీమయి

వ్రాలినది ఈ భరతఖండము

భక్తిపాడర తమ్ముడా!

వేదశాఖలు పెరిగె నిచ్చట

ఆదికావ్యం బందె నిచ్చట


అమరావతీ పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు

ఓరుగల్లున రాజ వీర లాంఛనముగా బలు శస్త్రశాలలు నిలుపునాడు

విద్యానగర రాజవీధుల గవితకు పెండ్లి పందిళ్ళు కప్పించునాడు

పొట్నూరికి సమీపమున నాంధ్ర సామ్రాజ్య దిగ్జయ స్తంభమెత్తించునాడు

ఆంధ్ర సంతతి కే మహితాభిమాన

దివ్య దీక్షా సుఖ స్ఫూర్తి తీవరించె

నా మహాదేశ మర్థించి యాంధ్రులార

చల్లుడాంధ్రలోకమున నక్షితలు నేడు


తృణ కంకణమునుండి:


అడుగుల బొబ్బలెత్త, వదనాంచలమందున చిన్కు చెమ్మటల్

మడుగులు గట్ట, మండు కనుమాలపుటెండ పడంతియోర్తు జా

ఱెడు జిలుగుంబయంట సవరించుచు, చొక్కిన యింపుతోడ కా

ల్నడకన బోవుచుండె నెడలన్ కనుపించెడి పచ్చతోటలకున్

నిమ్మచెట్టు లేగొమ్ము పందిళ్ళకింద

పుస్తకపు పేటికలను, నా హస్తముదిత

చిత్రసూత్రమునను వసియించియున్న

దోయి!యిందాక మన ప్రేమయును సఖుండ!


రాయప్రోలు సుబ్బారావు గారి ఖండకావ్యాలు, అనువాదాలు

ఖండకావ్యాలు

  • తృణకంకణము

  • ఆంధ్రావళి

  • కష్టకమల

  • రమ్యలోకము

  • వనమాల

  • మిశ్రమంజరి

  • స్నేహలతా దేవి

  • స్వప్నకుమారము

  • తెలుగు తోట

  • మాధురీ దర్శనం

  • రూపనవ నీయతం

అనువాదాలు

  • అనుమతి

  • భజగోవిందము

  • సౌందర్య లహరి

  • దూతమత్తేభము

  • లలిత

  • మధుకలశము

  • తెలుగుకవితకు అభినవ దీప్తినొసగి క్రొత్తపుంతలు చూపిన కోవిదుడు;

  • ప్రకృతి సౌందర్య దర్శన పధములందు నవ్య పదబంధ నిర్మాణ నాట్యరీతి తెలుగు కవులకు నేర్పిన దేవగురుడు;

  • రూపనవనీతమునకు సరోజభవుడు;

  • మాధురీదర్శనంబొక మధుర ఫణితి, లలిల తత్త్వార్ధ బోధకు లక్ష్యభూమి, పద్యమయమైన లక్షణ పాఠమునకు విద్య నేర్పిన కల్పక వేదతరువు;

  • అతడు పల్కిన కావ్యము లాగములు, అతడు పాడిన గేయములాంధ్రజాతి నిదుర మోల్కొల్పు అన్నది ఎంత సహజభావ ప్రకటన.

  • ఏకవిని యింతగా ఆచితూచి, అనుభవించి, పలవరించడం జరగని పని అనే చెప్పాలి. 

  • రాయప్రోలు సుబ్బారావు యుగకర్త; ఆచార్యుడు; ఆంధ్రవాణికి అభినవాదర్శ మార్గ విద్యాప్రదాత.

  • రాయప్రోలువారికి ఆంధ్రసాహితీలోకం, సాహితీరసికులు అంజలి, నివాళి ఏకమాత్రంగా సమర్పించడం తమ విధి, కర్తవ్యం.


రాయప్రోలు వారి తృణకంకణమునకు కట్టమంచి రామ లింగా రెడ్డి గారు వ్రాసిన సందేశము:

MAHARAJA'S COLLEGE, Mysore. 26th May 1916.

Though I have not known Mr. Rayaprolu Subbarao personally, I have been in touch with him by correspondence, common friends, and above all, his own splendid writings in prose and verse. He holds a high rank amongst modern Telugu Poets, and I think he is almost entitled to be acclaimed as the founder of a new school of poetry which is bound  to mark a new epoch in the development of Andhra literature. His imaginative gifts are of a high order and his power of phrase is remarkable, almost unique. He will bring name and fame to any institution with which he may be connected. And I, therefore, confidently recommend him as a man of genius who has every title to the admiration and encouragement of the Telugu people.

Signed - C.R.REDDY, M.A. (Cantab) - Principal, Maharaja's College, Mysore.

తెలుగు అనువాదం 

మహారాజ కాలేజీ, మైసూర్ , 26 మే 1916 తేదీ :

మిస్టర్. రాయప్రోలు సుబ్బారావు గారు నాకు వ్యక్తిగతంగా తెలియకపోయినప్పటికీ, నాకు  అతని గద్య మరియు పద్యాలలో అతని స్వంత అద్భుతమైన రచనలు ప్రచురణ లు ద్వారా  సాధారణ స్నేహితులు అందరికంటే ఎక్కువగానే తెలుసు. అతను ఆధునిక తెలుగు కవులలో ఉన్నత గుర్తింపును కలిగి ఉన్నాడు, మరియు ఆంధ్ర సాహిత్య వికాసంలో ఒక కొత్త యుగాన్ని గుర్తుచేసే ఒక కొత్త కవితా పాఠశాల స్థాపకుడిగా ఆయనకు ప్రశంసలు లభిస్తాయని నేను భావిస్తున్నాను. అతని ఊహాత్మక  కవితా రచనలు  ఎంతో ఆర్ద్రత కలిగివుంటాయి మరియు అతని పదబంధ శక్తి గొప్పది, దాదాపు ప్రత్యేకమైనది. అతను కనెక్ట్ అయ్యే ఏ సంస్థకైనా పేరు మరియు కీర్తిని తెస్తాడు. అందువల్ల, తెలుగు ప్రజల ప్రశంసలు మరియు ప్రోత్సాహాలకు బిరుదులకు తగిన  అర్హత  ఉన్న మేధావిగా నేను అతనిని నమ్మకంగా తెలుగు వారందరికి  సిఫార్సు చేస్తున్నాను.

సంతకం- సి.ఆర్. రెడ్డి  ఎం.ఏ., ప్రిన్సిపాల్, మహారాజా కాలేజీ,. మైసూర్.


ఈ క్రింది వీడియో యు.  ఆర్.యల్. ల లో రాయప్రోలు గురించి తెలుసుకోండి




ఈ రోజు సూక్తి :

"The future belongs to those who believe in the beauty of their dreams"

- Franklin D. Roosevelt

Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు &

గ్రూప్ లు చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం

సబ్స్క్రయిబ్ (subscribe) చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com




Sunday, March 14, 2021

భారతీయ సంఘ సేవకురాలు, రచయిత్రి. కంప్యూటర్ ఇంజనీర్ ఇన్‍ఫోసిస్ పద్మశ్రీ సుధామూర్తి గురించి తెలుసుకుందాం

భారతీయ సంఘ సేవకురాలు, రచయిత్రి. కంప్యూటర్ ఇంజనీర్   ఇన్‍ఫోసిస్ పద్మశ్రీ సుధామూర్తి గురించి తెలుసుకుందాం

పద్మశ్రీ సుధా మూర్తి (కన్నడ: ಸುಧಾ ಮೂರ್ತಿ), ఒక భారతీయ సంఘ సేవకురాలు, రచయిత్రి. కంప్యూటర్ ఇంజనీర్ గా జీవితాన్ని ప్రారంభించి ఇన్‍ఫోసిస్ ఫౌండేషన్ , గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈవిడ పలు అనాధాశ్రమాలను ప్రారంభించింది. అలాగే గ్రామీణాభివృద్దికి తోడ్పడ్డారు  కర్ణాటక లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి తద్వారా పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడినారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ గ్రంథాలతో "ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా" ప్రారంచించింది. తన వృత్తి జీవితంతో బాటు ఈవిడ ఒక మంచి కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయురాలు, కాల్పనిక రచనలు కూడా ఆమె  చేస్తుంది. ఈమె రచించిన కన్నడ నవల డాలర్ బహు  (డాలర్ కోడలు) ఆంగ్లములో  డాలర్ సొసే గా అనువదించబడింది. తర్వాత ఇదే నవల 2001 లో 'జీ టీవీ 'లో ధారావాహికగా ప్రసారమైనది.

సుధామూర్తి బాల్యం మరియు విద్య:

👉1950 ఆగస్టు 19 వ సంవత్సరము శనివారం నాడు కర్ణాటక రాష్ట్రం హావేరీ జిల్లా షిగ్గాన్ లో దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో ఆమె జన్మించింది. తండ్రి ఎస్. ఆర్. కులకర్ణి వైద్యుడు. బాల్యమంతా తల్లి తండ్రులు, తాతయ్య, నానమ్మల మధ్య గడిచింది.  

👉ఈ అనుభవాలతోనే పెద్దయ్యాక "How I Taught my Grandmother to Read & Other Stories". అనే పుస్తకాన్ని రచించింది. 

👉ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా హెచ్. ఆర్. కాదిం దివాన్ బిల్డింగ్ హౌసింగ్ ఐ.ఐ.టి కాన్పూర్ లలో కంప్యూటర్ సైన్స్ విభాగాలను , జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం లోని నారాయణరావ్ మెల్గిరి స్మారక న్యాయ కళాశాల లను ప్రారంభించడానికి భూరి విరాళాలను అందజేసింది.

👉సుధామూర్తి గారు  ఎలక్టికల్ ఇంజనీరింగ్ పట్టాను బి.వి.బి. సాంకేతిక కళాశాల నుండి తరగతి మొత్తానికి ప్రధమురాలిగా నిలిచి కర్ణాటక ముఖ్యమంత్రి నుండి స్వర్ణ పతకం అందుకొన్నారు . 

👉తర్వాత కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీని ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి తరగతి (Class) లో ప్రధమురాలిగా నిలిచి స్వర్ణపతకం అందుకొన్నారు.

విద్యాభ్యాసం పూర్తి చేసుకొని భారతదేశ అతిపెద్ద ఆటో పరిశ్రమ ఐన టెల్కో లో మొట్టమొదటి మహిళా ఇంజనీర్ గా ఉద్యోగం సాధించింది. 

👉అప్పటికి ఈ సంస్థలో కేవలము పురుషులకే స్థానం కల్పించేవారు. దీనిని ప్రశ్నిస్తూ ఆవిడ ఆ సంస్థ అధ్యక్షుడికి ఒక పోస్టుకార్డు రాసింది. దీనిని స్పందించిన ఆయన ఆవిడకు ప్రత్యేకంగా  మౌఖిక పరీక్ష  (Interview) నిర్వహించి, అప్పటికప్పుడు నియామక ఉత్తర్వులు అందించాడు. 

👉ఆ సంస్థ పూనా శాఖలో పనిచేస్తున్నపుడే ఆవిడకు ఎన్.ఆర్.నారాయణ మూర్తి తో పరిచయమై తర్వాతి కాలంలో వారిద్దరు వివాహం చేసుకోవడానికి దారితీసింది.

👉సుధా మూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధినేతగా పలు సేవలు అందిస్తున్నారు. అలాగే ఇన్ఫోసిస్ మరియి పెట్టుబడిదారీ సంశ్థ ఐన కెటారామన్ వెంచర్స్ సంస్థలకు తెర వెనుక ముఖ్స్య పెట్టుబడిదారుగా వ్యవహరిస్తున్నారు.

రచయిత్రి గా సుధా మూర్తి :

సుధా మూర్తి  మంచి రచయిత్రి కూడా. కాల్పనిక సాహిత్యంపై పలు రచనలు కూడా చేశారు. పెంగ్విన్ ముద్రణా సంస్థద్వారా దాతృత్వం, ఆతిధ్యం , స్వీయ పరిపూర్ణత (self-realization ) లపై కాల్పనిక పాత్రల ద్వారా ఆమె రచించిన పలు పుస్తకాలు ప్రచురింపబడ్డాయి

  • ఈమె రచించిన How I Taught My Grandmother to Read & Other Stories అనే పుస్తకము దాదాపు పదిహేను  (15) భాషలలో తర్జుమా చేయబడింది.

  • ఆమె ఈ మధ్యనే రచించిన గ్రంథము The Day I Stopped Drinking Milk. 

  • ఈవిడ ఇతర రచనలు Wise and OtherwiseOld Man and his God and Gently Falls the Bakula.

పురస్కారాలు :

  • 2004 - సామాజిక సేవకు గానూరాజాలక్ష్మి పురస్కారము, రాజాలక్ష్మి ఫౌండేషన్, చెన్నై నుండి అందుకున్నారు.

  • 2006 - భారత ప్రభుత్వము నుండి అత్యుత్తమ పద్మశ్రీ పురస్కారము , సామాజిక సేవ, దాతృత్వం , విద్యా రంగాలలో ఆమె సేవలకు గౌరవ డాక్టరేటు.

  • మనదేశంలో న్యాయ విద్య , ఉపకారవేతనాల అందవేతకు ప్రముఖ న్యాయవేత్త సంతోష్ హెగ్డే తో కలిసి గౌరవ న్యాయ డాక్టరేటు ( honorary LL.D (Doctor of Laws).

  • సాహితీ సేవ , ఆమె రచనలకు ఆర్. కె. నారాయణన్ పురస్కారము.

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో ఆమె గురించి తెలుసుకోండి :


Today's Quote:

"There is only one thing that makes a dream impossible to achieve: the fear of failure."   -Paulo Coelho

Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

By Admin Facebook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My Facebook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com



Most Recent

4. "ప్రపంచాన్ని దయతో గెలిచిన మహానుభావురాలు – మదర్ థెరేస్సా"

Mother Teresa Biography – Life, Awards, and Humanitarian సర్వీసెస్ "ప్రపంచాన్ని దయతో గెలిచిన మహానుభావురాలు – మదర్ థెరేస్సా" Mother...

Latest