'ఓం'తో అలసట మాయం..శాస్త్రీయంగా నిరూపించిన బాలిక మరియు శాస్త్రజ్ఞులు
"ఓం"శబ్దము ఓం, ఓమ్, లేదా ఓంకారము త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది.
హిందూమతానికి కేంద్ర బిందువు. పరమాత్మకు శబ్దరూప ప్రతీక. దీనికి నాలుగు పాదాలున్నాయి. అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు.
వాటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం. దాన్ని గ్రహించినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు. ఇదొక ఏకాక్షర మంత్రము.
హిందువుల నమ్మే ముఖ్యమైన మంత్రం :
అనేక మంది హిందువులు దేవుని పూజించే సమయంలో, తమ మంత్రోచ్చారణ ప్రారంభాన్ని"ఓం" తోనూ మరియు "స్వాహా" తో ముగింపుని ఇవ్వడాన్ని మనం తరచుగా గమనిస్తూనే ఉంటాము. దీనికి గల ప్రధాన కారణమేమిటో మీకు తెలుసా ?
పురాతన హిందూ ఋషుల ప్రామాణికాల ప్రకారం, "ఓం" ప్రధానంగా మూడు శబ్దాలను కలిగి ఉంటుంది. అవి వరుసగా అ, ఉ, మ గా ఉన్నాయి. హిందూ మతం నమ్మకాల ప్రకారం ఈ మూడు అక్షరాలూ, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తాయని తెలుపబడింది.
అనేక మంది హిందువులు దేవుని పూజించే సమయంలో, తమ మంత్రోచ్చారణ ప్రారంభాన్ని"ఓం" తోనూ మరియు "స్వాహా" తో ముగింపుని ఇవ్వడాన్ని మనం తరచుగా గమనిస్తూనే ఉంటాము. దీనికి గల ప్రధాన కారణమేమిటో మీకు తెలుసా ?
పురాతన హిందూ ఋషుల ప్రామాణికాల ప్రకారం, "ఓం" ప్రధానంగా మూడు శబ్దాలను కలిగి ఉంటుంది. అవి వరుసగా అ, ఉ, మ గా ఉన్నాయి. హిందూ మతం నమ్మకాల ప్రకారం ఈ మూడు అక్షరాలూ, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తాయని తెలుపబడింది.
- శబ్దమే భగవంతుడని చెప్పబడింది. ప్రతిపదము నకు మూలాధారము గా ఒక గుర్తుగా ఉంటే అది ఉత్తమోత్తమ చిహ్నం అవుతుంది. శబ్దోచ్చారణ లో మనం కంఠంలోని స్వరపేటికను,అంగిలిని, శబ్ద ఫలకాన్ని ఉపయోగిస్తాము.ఏ శబ్దము నుండి ఇతర శబ్దాలన్నీ వ్యక్తమవుతున్నాయో అలాంటి అత్యంత స్వాభావిక శబ్దము ఏదైనా ఉందా? ఆ శబ్దమే ప్రణవము లేక ఓంకారము.
- ఇందులో అ,ఉ,మ లు ఉన్నాయి.నాలుకలోని, అంగిలిలోని ఏ భాగము కూడా 'అ 'కార ఉచ్చారణ కు తోడ్పడదు. ఇది ఓంకారానికి బీజం గా ఉంది చివరిది 'మ 'కారము.పెదవులని మూసి దీన్ని ఉచ్చరిస్తారు. నోటిలోని మూలభాగము నుండి అంత్యభాగము వరకు కూడా ఉచ్చారణ సమయములో దొర్లుకుంటూ ఉంటుంది.ఇలా శబ్ద ఉచ్చారణా ప్రక్రియనంతా ఓంకారం తెలియజేస్తూంది. అందువలన ఓంకారాన్ని స్వీకరించడము జరిగింది.
శాస్త్రాలు ఏమి చెప్పాయి :
- ధర్మ శాస్త్రాల ప్రకారం, విశ్వం (3) మూడు రకాల ప్రాథమిక శక్తులను కలిగి ఉంటుంది. అవి వరుసగా, సత్వ, రజో మరియు తమో గుణాలు.
- ఇక్కడ సత్వ గుణం, భగవంతుని లేదా మంచి లక్షణాలను ప్రతిబింబిస్తుంది.
- రజో గుణం మనిషి లేదా రాజు యొక్క సహజ లక్షణాలకు నిదర్శనం.
- తమో గుణం చెడు లేదా రాక్షస లక్షణాలకు సంబంధించినది.
- ప్రతి ఒక్క మూలకం కూడా, వివిధ నిష్పత్తులలో ఈ మూడు గుణాలను కలిగి ఉంటుందని చెప్పబడింది.
- ఈ శక్తుల లేదా గుణాల నిష్పత్తిని మార్చగలిగినా, సమ్మేళనం మాత్రం అలాగే మిగిలిపోతుంది.
- ఈ మూడు గుణాల కలయిక ద్రవ్యరాశిగా మారుతుంది. "ఓం" అనే పదం ఈ మూడు గుణాల కలయికగా ఉంటుంది.
- హిందూ గ్రంథాల ప్రకారం, ఓం అనే పదం శివుడిని మరియు వినాయకుడిని కూడా సూచిస్తుంది.
- వినాయకుడిని కొన్ని సందర్భాలలో "ఓం" రూపంలో చిత్రీకరించి పూజించడం మనం గమనిస్తూనే ఉంటాం.
- దైవ కార్యాన్ని మొదలుపెట్టాలన్నా, హిందూ ఆచారాల ప్రకారం, మొట్టమొదటగా వినాయకుని పూజించడం పరిపాటిగా ఉంటుంది.
- విశ్వం ఆవిర్భావం జరిగినప్పుడు, ఓం అనే ధ్వని వినిపించిందన్నది పురాతన కాలం నుండి వస్తున్న ప్రధాన నమ్మకం.
- విశ్వం ముగింపునకు వచ్చినప్పుడు కూడా అదే ధ్వని వినిపిస్తుందని చెప్పబడింది.
- ప్రాధమిక ధ్వనిగా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్న కారణంగా, ఆ శబ్దంతోనే మంత్రోచ్చారణ ప్రారంభించడం కూడా ఆనవాయితీగా వస్తున్నది.
విశిష్టత -అన్వేష రాయ్ పరిశోధన...
ఓం శబ్దంతో శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలుగేళ్ల బాలిక ప్రయోగాత్మ కంగా నిరూపించింది. పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్ లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్తలను అకట్టుకుంది. కోల్కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది.
- ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది.
- అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యం కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు.
- అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని ఆ బాలిక తెలిపింది. ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌన:పున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్మిటర్స్తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి.
- ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియజేసింది. అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది.
- ఈ దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు.
- ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతుందని తమ అన్వేష నిరూపించిందని వెంకట్రామన్ తెలిపారు.
- ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టలేదని స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు.
- ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన వర్క్షాప్నకు 165 విద్యార్థులను ఎంపిక చేశామని ఆయన అన్నారు.
- వర్క్షాప్లో భాగంగా అన్వేష ఉత్తరాఖండ్లో పర్యటించినపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది.
- అలాగే పూజారులు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది. దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది. దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది.
- ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్ల పౌన:పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది.
17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది. ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు అన్వేష రాయ్ తెలిపింది.
ఈ క్రింది వీడియోల యు.ఆర్.యల్ . లు .ద్వారా మరింత వివరాలు తెలుసు కోండి
OM Chanting @528 Hz | 8 Hours - YouTube
Search Results
OM MANTRA: MOST POWERFUL TRANSCENDENTAL ...
OM Chanting @417 Hz | Removes All Negative Blocks ...
Om Chanting Meditation : 100 TIMES ! - YouTube
OM MANTRA SOUND OF THE UNIVERSE - YouTube
Note:
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి,
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి.
అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like, share and subscribe చేయండి.
Also see my You tube channel bdl 1tv like, share and Subscribe, కామెంట్ చేయడం మర్చిపోకండి .
మీ కామెంట్ ,షేర్ , లైక్ మాకెంతో మేలు చేస్తుంది, థాంక్యూ
Note:
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి,
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి.
అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like, share and subscribe చేయండి.
Also see my You tube channel bdl 1tv like, share and Subscribe, కామెంట్ చేయడం మర్చిపోకండి .
మీ కామెంట్ ,షేర్ , లైక్ మాకెంతో మేలు చేస్తుంది, థాంక్యూ