Showing posts with label ఇన్‍ఫోసిస్ సుధామూర్తి. Show all posts
Showing posts with label ఇన్‍ఫోసిస్ సుధామూర్తి. Show all posts

Sunday, March 14, 2021

భారతీయ సంఘ సేవకురాలు, రచయిత్రి. కంప్యూటర్ ఇంజనీర్ ఇన్‍ఫోసిస్ పద్మశ్రీ సుధామూర్తి గురించి తెలుసుకుందాం

భారతీయ సంఘ సేవకురాలు, రచయిత్రి. కంప్యూటర్ ఇంజనీర్   ఇన్‍ఫోసిస్ పద్మశ్రీ సుధామూర్తి గురించి తెలుసుకుందాం

పద్మశ్రీ సుధా మూర్తి (కన్నడ: ಸುಧಾ ಮೂರ್ತಿ), ఒక భారతీయ సంఘ సేవకురాలు, రచయిత్రి. కంప్యూటర్ ఇంజనీర్ గా జీవితాన్ని ప్రారంభించి ఇన్‍ఫోసిస్ ఫౌండేషన్ , గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈవిడ పలు అనాధాశ్రమాలను ప్రారంభించింది. అలాగే గ్రామీణాభివృద్దికి తోడ్పడ్డారు  కర్ణాటక లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి తద్వారా పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడినారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ గ్రంథాలతో "ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా" ప్రారంచించింది. తన వృత్తి జీవితంతో బాటు ఈవిడ ఒక మంచి కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయురాలు, కాల్పనిక రచనలు కూడా ఆమె  చేస్తుంది. ఈమె రచించిన కన్నడ నవల డాలర్ బహు  (డాలర్ కోడలు) ఆంగ్లములో  డాలర్ సొసే గా అనువదించబడింది. తర్వాత ఇదే నవల 2001 లో 'జీ టీవీ 'లో ధారావాహికగా ప్రసారమైనది.

సుధామూర్తి బాల్యం మరియు విద్య:

👉1950 ఆగస్టు 19 వ సంవత్సరము శనివారం నాడు కర్ణాటక రాష్ట్రం హావేరీ జిల్లా షిగ్గాన్ లో దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో ఆమె జన్మించింది. తండ్రి ఎస్. ఆర్. కులకర్ణి వైద్యుడు. బాల్యమంతా తల్లి తండ్రులు, తాతయ్య, నానమ్మల మధ్య గడిచింది.  

👉ఈ అనుభవాలతోనే పెద్దయ్యాక "How I Taught my Grandmother to Read & Other Stories". అనే పుస్తకాన్ని రచించింది. 

👉ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా హెచ్. ఆర్. కాదిం దివాన్ బిల్డింగ్ హౌసింగ్ ఐ.ఐ.టి కాన్పూర్ లలో కంప్యూటర్ సైన్స్ విభాగాలను , జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం లోని నారాయణరావ్ మెల్గిరి స్మారక న్యాయ కళాశాల లను ప్రారంభించడానికి భూరి విరాళాలను అందజేసింది.

👉సుధామూర్తి గారు  ఎలక్టికల్ ఇంజనీరింగ్ పట్టాను బి.వి.బి. సాంకేతిక కళాశాల నుండి తరగతి మొత్తానికి ప్రధమురాలిగా నిలిచి కర్ణాటక ముఖ్యమంత్రి నుండి స్వర్ణ పతకం అందుకొన్నారు . 

👉తర్వాత కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీని ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి తరగతి (Class) లో ప్రధమురాలిగా నిలిచి స్వర్ణపతకం అందుకొన్నారు.

విద్యాభ్యాసం పూర్తి చేసుకొని భారతదేశ అతిపెద్ద ఆటో పరిశ్రమ ఐన టెల్కో లో మొట్టమొదటి మహిళా ఇంజనీర్ గా ఉద్యోగం సాధించింది. 

👉అప్పటికి ఈ సంస్థలో కేవలము పురుషులకే స్థానం కల్పించేవారు. దీనిని ప్రశ్నిస్తూ ఆవిడ ఆ సంస్థ అధ్యక్షుడికి ఒక పోస్టుకార్డు రాసింది. దీనిని స్పందించిన ఆయన ఆవిడకు ప్రత్యేకంగా  మౌఖిక పరీక్ష  (Interview) నిర్వహించి, అప్పటికప్పుడు నియామక ఉత్తర్వులు అందించాడు. 

👉ఆ సంస్థ పూనా శాఖలో పనిచేస్తున్నపుడే ఆవిడకు ఎన్.ఆర్.నారాయణ మూర్తి తో పరిచయమై తర్వాతి కాలంలో వారిద్దరు వివాహం చేసుకోవడానికి దారితీసింది.

👉సుధా మూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధినేతగా పలు సేవలు అందిస్తున్నారు. అలాగే ఇన్ఫోసిస్ మరియి పెట్టుబడిదారీ సంశ్థ ఐన కెటారామన్ వెంచర్స్ సంస్థలకు తెర వెనుక ముఖ్స్య పెట్టుబడిదారుగా వ్యవహరిస్తున్నారు.

రచయిత్రి గా సుధా మూర్తి :

సుధా మూర్తి  మంచి రచయిత్రి కూడా. కాల్పనిక సాహిత్యంపై పలు రచనలు కూడా చేశారు. పెంగ్విన్ ముద్రణా సంస్థద్వారా దాతృత్వం, ఆతిధ్యం , స్వీయ పరిపూర్ణత (self-realization ) లపై కాల్పనిక పాత్రల ద్వారా ఆమె రచించిన పలు పుస్తకాలు ప్రచురింపబడ్డాయి

  • ఈమె రచించిన How I Taught My Grandmother to Read & Other Stories అనే పుస్తకము దాదాపు పదిహేను  (15) భాషలలో తర్జుమా చేయబడింది.

  • ఆమె ఈ మధ్యనే రచించిన గ్రంథము The Day I Stopped Drinking Milk. 

  • ఈవిడ ఇతర రచనలు Wise and OtherwiseOld Man and his God and Gently Falls the Bakula.

పురస్కారాలు :

  • 2004 - సామాజిక సేవకు గానూరాజాలక్ష్మి పురస్కారము, రాజాలక్ష్మి ఫౌండేషన్, చెన్నై నుండి అందుకున్నారు.

  • 2006 - భారత ప్రభుత్వము నుండి అత్యుత్తమ పద్మశ్రీ పురస్కారము , సామాజిక సేవ, దాతృత్వం , విద్యా రంగాలలో ఆమె సేవలకు గౌరవ డాక్టరేటు.

  • మనదేశంలో న్యాయ విద్య , ఉపకారవేతనాల అందవేతకు ప్రముఖ న్యాయవేత్త సంతోష్ హెగ్డే తో కలిసి గౌరవ న్యాయ డాక్టరేటు ( honorary LL.D (Doctor of Laws).

  • సాహితీ సేవ , ఆమె రచనలకు ఆర్. కె. నారాయణన్ పురస్కారము.

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో ఆమె గురించి తెలుసుకోండి :


Today's Quote:

"There is only one thing that makes a dream impossible to achieve: the fear of failure."   -Paulo Coelho

Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

By Admin Facebook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My Facebook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com



Most Recent

భారతీయ నాట్య కళాకారుడు, గురువు, రచయిత, సంగీత శాస్త్రవేత్త, మరియు నాట్య పునరుద్ధారకుడు నటరాజ రామకృష్ణ

భారతీయ నాట్య కళాకారుడు, గురువు, రచయిత, సంగీత శాస్త్రవేత్త, మరియు నాట్య పునరుద్ధారకుడు నటరాజ రామకృష్ణ   నటరాజ రామకృష్ణ (1923–2011) భారతీయ నాట...

Latest