ప్రపంచం లోనే అతి చిన్న వయసులోనే ప్రధానోపాధ్యాయుడు అయిన వ్యక్తి బాబర్ అలీ గురించి తెలుసుకుందాము
బాబర్ అలీ అతి చిన్న వయసులోనే (16) ప్రధానోపాదయుడైన వ్యక్తి
జననం :ఇతని జననం 18 మార్చి 1993) పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ ఇండియా
తల్లి తండ్రులు : ఎండి నాసిరుద్దీన్, బానురా బీబీ
ప్రస్తుత విద్య : బెర్హంపూర్ కృష్ణాత్ కాలేజీ ఇంగ్లీష్ ఆనర్స్ లో గ్రాడ్యుయేట్ చేసారు .(కళ్యాణి యూనివర్సిటీ పశ్చిమ బెంగాల్ , భారతదేశం లో )మరియు యమ్ .ఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసారు
జాతీయత: భారతీయుడు
పురస్కారాలు : రియల్ హీరోస్ అవార్డు 2009, సి. ఎన్ . ఎన్ .ఐ . బి. యెన్.వెబ్సైట్: www .anandasikshaniketan.in
- బాబర్ అలీ కి పేదరికం అంటే ఏమిటో తెలుసు. పేదవారు చదివి పైకి రావడం ఎంత కష్టమో కూడా తెలుసు . అందుకే అతడు తన చిన్న తనంలోనే తన ముషిరాబాద్ గ్రామములో ఉచిత విద్య పాఠశాలను తన ఇంటి పెరడులో 7 సంవత్సరాల ప్రాయం లోనే స్థాపించాడు . పాఠశాల సాయంత్రం 4.00 గంటలకు ప్రారంభమై రాత్రి 8 వరకు కొనసాగుతుంది.
- ఒక విద్యార్థితో ప్రారంభమైన యితని పాఠశాల క్రమంగా చుట్టుపక్కల 5 కిలోమీటర్లు పైబడిన గ్రామాల విద్యార్థులు రావడం ప్రారంభించారు. క్రమంగా పాఠశాల బయట స్థాపించబడి 10 మంది టీచర్లు 800 విద్యార్థులతో ఇప్పుడు నడుస్తుంది.
- విద్య నేర్పించడానికి టీచర్లు కొంతమంది స్వచ్చందంగా పని చేస్తుంటారు.
- ఇతని పాఠశాల ప్రభుత్వ గుర్తింపును పొందింది. ఉచిత మధ్యాహ్న భోజన సదుపాయం కూడా కల్పించారు. స్వామి వివేకా నంద నుండి బాబర్ అలీ స్ఫూర్తిని పొందారు. అతని పాఠశాలలో దేశభక్తులు మేధావుల ఫోటోలు ఉంటాయి.
- 2009 రియల్ హీరోస్ సి .యన్ .యన్ అవార్డు పొందారు.
- లిటరసీ హీరో అవార్డు యన్ .డి. టీవీ వారు ఇచ్చారు.
- ఫోర్బ్స్ ఆసియా వారు అండర్ 30 సోషల్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు ఇచ్చారు.
- బి.బి .సి ఎడ్యుకేషన్ లీడర్ షిప్ అవార్డు అందుకున్నారు .
- ఇతని బయోగ్రఫీ కర్ణాటక ప్రభుత్వము సి.బి.యస్.సి 10 వ తరగతి( పి .యు.సి.) కోర్స్ లో పాఠ్యము అంశం గా ప్రవేశపెట్టింది.
- బాబర్ అలీ అమీర్ ఖాన్ షో 'సత్య మేవ జయతే 'లో 2012 లో పాల్గొన్నారు
- అలాగే TED, INK షో లలో పాల్గొన్నారు.
ఇతన్ని స్ఫూర్తి గా తీసుకొని మనం కూడా నిరక్షరాస్యతను తొలగించడానికి మన వంతు ప్రయత్నాన్ని చేద్దామా ..
ఈ క్రింది యు.ఆర్ .యల్.లోఇతని వీడియోలు చూద్దామా?
Success Story of BABAR ALI - The Youngest Headmaster in ...
TEDxSIBMBangalore - Babar Ali, "World's youngest ...
Babar Ali Youngest Headmaster in the World - YouTube
Note:
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి,
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి.
అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి.
Also see my You tube channel bdl 1tv like, share and Subscribe, కామెంట్ చేయడం మర్చిపోకండి .
మీ కామెంట్ ,షేర్ , లైక్ మాకెంతో మేలు చేస్తుంది, థాంక్యూ