Itsourindia.blogspot.com

About Great Indian heritage places, great Indian people, great Indian known people, great Indian unknown people

Showing posts with label మహానుభావులు. Show all posts
Showing posts with label మహానుభావులు. Show all posts

Wednesday, March 17, 2021

నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు గారి వివరాలు

నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన

రాయప్రోలు సుబ్బారావు గారి వివరాలు 



రాయప్రోలు సుబ్బారావు గారు 

నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు (మార్చి 17, 1892 - జూన్ 30, 1984) తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు. ఈయన 1913లో వ్రాసిన తృణకంకణముతో తెలుగు కవిత్వములో నూతన శకము ఆరంభమైనదని అంటారు. ఇందులో ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్ళికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో ఖండకావ్య ప్రక్రియకు అంకురార్పణ చేశాడు. భావకవుల్లో కూడా కొందరు ఆద్యులు, కొందరు ఆఢ్యులు. రాయప్రోలు సుబ్బారావు గారు నిస్సందేహంగా ఆద్యులే.  భావకవిత్వం ప్రాచుర్యం పొందడానికి వ్యాసముద్రణలు కాదు. శ్రోతలముందు భావకవితాపఠనం ముఖ్యం. 

  • సుబ్బారావుగారు మెట్రిక్ దాకా చదివి, ముందుకు కొనసాగించలేని పరిస్థితుల్లో రాజమండ్రి చిలుకూరు వీరభద్రరావు సంపాదకత్వంలోని 'ఆంధ్రకేసరీ పత్రికలో రచనలుచేయడం, అజ్ఞాతసంపాదకుడి విధులు, మేనమామతో ఆశు కవితాజంటవిన్యాసాలు స్వత:రసదృష్టి పెరిగినా, ఆశుకవితలమీద వెగటుతనం ఆవహించి, వాటిపై సన్యాసందాకా పోయింది.

  • న్యాయవాది గంటిలక్ష్మన్నపంతులు ప్రోద్బలంతో ఆంగ్లకవి 'గోల్డ్ స్మిత్ - హెర్మిట్' కౄతిని 'లలితా(1909)గా, టెన్నిసన్క్ రచన - 'డోరా'ను 'అనుమతీ(1910) లఘుకావ్యంగాను, 'తృణకంకణం'(1912) నూతనరచనలను సౄష్టించాలని సంకల్పంతోనే ఆశుకవిత్వానికి వీడుకోలు పలకవలసి వచ్చింది.

  • మదరాసు చేరుకుని, కొమర్రాజు వారి దగ్గర 'విజ్ణానచంద్రికాగ్రంధమండలీ, 'ఆంధ్రవిజ్ణానసర్వస్వం' లో లేఖకునిగా ఉద్యోగం చేశారు.

  • విశిష్టకవిత్వానికి అనాదరణ ఆనాటి నుంచే మొదలైంది. ఆధునిక కవిత్వరచనలు చేస్తున్నా కూడ, రాయప్రోలు వారి 'కొత్తపోకడలు" లోకం గుర్తింపుకు నోచుకోలేదు.  వీరి కావ్యాలు మొదటదశలో ఎవరి దౄష్టిని ఆకర్షించలేదు. 

  • కవితలు, కావ్యాలు వ్రాస్తున్నా, ఆనాడు అధికంగా వ్యాప్తి వున్న వరకట్నం దురాచారాన్ని భరించలేకపోయారు.

  • ప్రత్యక్ష ఘటన, బ్రాహ్మణయువతి 'స్నేహలత" స్వయంకృతంగా అగ్నిజ్వాలకు ఆహుతికావడం అనేక కవులకు ప్రేరణ కలిగించింది.

  • ఈ ఇతి వృత్తంతో నవీనశైలితో  పద్యకావ్యం  రాయప్రోలుకు కలిగిన నూతన దృ ష్టితో వంగదేశం వలసపోయారు.

  • విశ్వకవి రవీంద్రుని అంతేవాసితనం, సాహిత్యసౌందర్యాలను స్వంతంచేసుకుని, స్వదేశం వచ్చారు.

  • కాల్పనికకవిత్వం, జాతీయోద్యమం, ఆంధ్రోద్యమంతో ప్రభావంచెంది, 'ఆంధ్రావళీ అవతరణకు దారితీసింది.

  • ఈ ప్రభావం, రామమోహన గ్రంధాలయంలో (1916) 'హౄదయములను చేల్చి చదవమనీ సదయులందరికి సందేశాన్నిచ్చారు.

తెలుగు సాహిత్య యుగకర్త


తెలుగుసేమలోని విద్యావంతులు బెంగాలులో వన్నెలుపోతున్న భావచైతన్యం వల్ల ప్రభావితమవుతున్న కాలంలో, తమ మాతౄభాషలో తోటివారికోసం సంకల్పించిన పధం నిర్మిస్తున్న కాలమది. సాహితీభాషామూర్తులు అనుకున్నది సాథించడానికి దారులు తమరే పరచుకుంటున్న పవిత్ర సాహితీపథాలవి. యిరవయ్యవ శతాబ్దపు చివరి దశకకాలం. 1891-92 సంవత్సరం. భావిభారత నవ్యాంధ్ర సాహితీముర్తిత్వానికి సంకేతంగా గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో ఒక మాతౄమూర్తి పురుడుపోసుకుని పుత్రున్ని కన్నది. అది రాయప్రోలు వారి వంశం. పసివాడి పేరు వేంకటసుబ్బారావు. వారి కవిత్వాన్ని, ప్రక్రియని ఒక రకమైన 'సాహితీయుగం - యుగకర్త గా చెలామణి కావడాన్ని బట్టి రాయప్రోలు వారికి సరిసములను కష్టపడి పట్టుకోవాలి.

 


అది 1916 సంక్రాంతిపండుగ. బెజవాడ రామమోహనగ్రంధాలయపు ఆవరణలో జరుగుతున్న మహోత్సవ సభ. నిండుసభలో ఆంధ్రాభిమానపూరితమైన పద్యలహరిని శ్రావ్యభరితంగా గానంచేసిన వ్యక్తి రాయప్రోలు సుబ్బారావు . ఆ పద్యాల్లో, తెనుగువాణి వర్ధిల్లింది. తెనుగుకత్తి మెరసింది.  తెనుగురేఖ అలరింది. తెనుగుభూమి యావత్తు వసుంధరనే సస్యశ్యామలభరితంకావించింది. 'చావలేదు, చావలేదు, ఆంధ్రుల మహోజ్జ్వల చరిత్ర" హౄదయములు చీల్చి చదువుడో సదయులారా అని సాహితీసందేశాన్నిచ్చాడు.


రాయప్రోలు సుబ్బారావు  గారిది ది గ్రుడ్డి అనుకరణ కాదు. తెలుగు, సంస్కృత భాషా పటిమను ఆయన విడలేదు. మన సమాజానికి అనుగుణంగా భావుకతను అల్లి తెలుగు కవితకు క్రొత్త సొగసులు అద్దాడు. రాయప్రోలు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాని. ఆయన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి. వ్యక్తిగతంగా మాత్రం కవిత్వంలో వ్రాసిన దేశభక్తికి ఫక్తు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి రాయప్రోలు.


రాయప్రోలు సుబ్బారావు మొదటి చూపులోనే చూపరులను ఆకట్టుకుంటారని ప్రతీ తి. తమ బెట్టుతో, బింకంతో, ఠీవితో, పల్లెవాటుల వయ్యారంతో, చెక్కుచెదరని క్రాఫింగ్‌తో నిండుగా ఉండేవారు. ఐతే ఒక పక్క కవిత్వంలో మన వంటి ధీరులింకెందునూ లేరని, ఏదేశమేగినా జాతిగౌరవం నిలపాలని వ్రాస్తూనే, మరొక పక్క తెలంగాణలో ప్రజలు రాజ్యంతో వీరోచితంగా పోరాడుతూండగా నైజాం రాజ్యాన్ని పొగుడుతూ రగడ రచించారన్న పేరు మూటకట్టుకున్నారు. 


వారిని గురించి రాస్తూ ఆంధ్రపత్రికలో సాహిత్యంలో కట్టలు తెంచుకుని మరవపారిన వీరి దేశభక్తి నిత్యజీవితాన్ని ముట్టనయినా ముట్టలేదు. ‘అవమానమేలరా అనుమానమేల, భరతపుత్రుడనంచు భక్తితో పలుక’ అని ప్రశ్నించి, ‘కంకణ విసర్జనకిది కాలమగునె’ అని హెచ్చరించిన వీరు జాతీయోద్యమం ముమ్మరమై నిజాం నవాబు తఖ్తు పునాదులు ఊగిసలాడే వేళకు, దీక్షాకంకణం తృణకంకణంలాగ విదిల్చివేశారు. వీరు పదవికి, పలుకులకు తగినంతగా ప్రజాహితమేమీ చేయలేదనే ప్రవాదమూ ఉంది. అని వ్రాశారు....


అవమానమేలరా అనుమానమేల, భరతపుత్రుడనంచు భక్తితో పలుక’ అని ప్రశ్నించి, ‘కంకణ విసర్జనకిది కాలమగునె’ అని హెచ్చరించిన వీరు జాతీయోద్యమం ముమ్మరమై నిజాం నవాబు తఖ్తు పునాదులు ఊగిసలాడే వేళకు, దీక్షాకంకణం తృణకంకణంలాగ విదిల్చివేశారు. వీరు పదవికి, పలుకులకు తగినంతగా ప్రజాహితమేమీ చేయలేదనే ప్రతి  వాదమూ ఉంది. అని వ్రాశారు.


కొన్ని మచ్చు  తునకలు 


ఏ దేశమేగినా ఎందుకాలిడినా

ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన

పొగడరా నీ తల్లి భూమి భారతిని

నిలుపరా నీ జాతి నిండు గౌరవము

శ్రీలు పొంగిన జీవగడ్డయి

పాలు పారిన భాగ్యసీమయి

వ్రాలినది ఈ భరతఖండము

భక్తిపాడర తమ్ముడా!

వేదశాఖలు పెరిగె నిచ్చట

ఆదికావ్యం బందె నిచ్చట


అమరావతీ పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు

ఓరుగల్లున రాజ వీర లాంఛనముగా బలు శస్త్రశాలలు నిలుపునాడు

విద్యానగర రాజవీధుల గవితకు పెండ్లి పందిళ్ళు కప్పించునాడు

పొట్నూరికి సమీపమున నాంధ్ర సామ్రాజ్య దిగ్జయ స్తంభమెత్తించునాడు

ఆంధ్ర సంతతి కే మహితాభిమాన

దివ్య దీక్షా సుఖ స్ఫూర్తి తీవరించె

నా మహాదేశ మర్థించి యాంధ్రులార

చల్లుడాంధ్రలోకమున నక్షితలు నేడు


తృణ కంకణమునుండి:


అడుగుల బొబ్బలెత్త, వదనాంచలమందున చిన్కు చెమ్మటల్

మడుగులు గట్ట, మండు కనుమాలపుటెండ పడంతియోర్తు జా

ఱెడు జిలుగుంబయంట సవరించుచు, చొక్కిన యింపుతోడ కా

ల్నడకన బోవుచుండె నెడలన్ కనుపించెడి పచ్చతోటలకున్

నిమ్మచెట్టు లేగొమ్ము పందిళ్ళకింద

పుస్తకపు పేటికలను, నా హస్తముదిత

చిత్రసూత్రమునను వసియించియున్న

దోయి!యిందాక మన ప్రేమయును సఖుండ!


రాయప్రోలు సుబ్బారావు గారి ఖండకావ్యాలు, అనువాదాలు

ఖండకావ్యాలు

  • తృణకంకణము

  • ఆంధ్రావళి

  • కష్టకమల

  • రమ్యలోకము

  • వనమాల

  • మిశ్రమంజరి

  • స్నేహలతా దేవి

  • స్వప్నకుమారము

  • తెలుగు తోట

  • మాధురీ దర్శనం

  • రూపనవ నీయతం

అనువాదాలు

  • అనుమతి

  • భజగోవిందము

  • సౌందర్య లహరి

  • దూతమత్తేభము

  • లలిత

  • మధుకలశము

  • తెలుగుకవితకు అభినవ దీప్తినొసగి క్రొత్తపుంతలు చూపిన కోవిదుడు;

  • ప్రకృతి సౌందర్య దర్శన పధములందు నవ్య పదబంధ నిర్మాణ నాట్యరీతి తెలుగు కవులకు నేర్పిన దేవగురుడు;

  • రూపనవనీతమునకు సరోజభవుడు;

  • మాధురీదర్శనంబొక మధుర ఫణితి, లలిల తత్త్వార్ధ బోధకు లక్ష్యభూమి, పద్యమయమైన లక్షణ పాఠమునకు విద్య నేర్పిన కల్పక వేదతరువు;

  • అతడు పల్కిన కావ్యము లాగములు, అతడు పాడిన గేయములాంధ్రజాతి నిదుర మోల్కొల్పు అన్నది ఎంత సహజభావ ప్రకటన.

  • ఏకవిని యింతగా ఆచితూచి, అనుభవించి, పలవరించడం జరగని పని అనే చెప్పాలి. 

  • రాయప్రోలు సుబ్బారావు యుగకర్త; ఆచార్యుడు; ఆంధ్రవాణికి అభినవాదర్శ మార్గ విద్యాప్రదాత.

  • రాయప్రోలువారికి ఆంధ్రసాహితీలోకం, సాహితీరసికులు అంజలి, నివాళి ఏకమాత్రంగా సమర్పించడం తమ విధి, కర్తవ్యం.


రాయప్రోలు వారి తృణకంకణమునకు కట్టమంచి రామ లింగా రెడ్డి గారు వ్రాసిన సందేశము:

MAHARAJA'S COLLEGE, Mysore. 26th May 1916.

Though I have not known Mr. Rayaprolu Subbarao personally, I have been in touch with him by correspondence, common friends, and above all, his own splendid writings in prose and verse. He holds a high rank amongst modern Telugu Poets, and I think he is almost entitled to be acclaimed as the founder of a new school of poetry which is bound  to mark a new epoch in the development of Andhra literature. His imaginative gifts are of a high order and his power of phrase is remarkable, almost unique. He will bring name and fame to any institution with which he may be connected. And I, therefore, confidently recommend him as a man of genius who has every title to the admiration and encouragement of the Telugu people.

Signed - C.R.REDDY, M.A. (Cantab) - Principal, Maharaja's College, Mysore.

తెలుగు అనువాదం 

మహారాజ కాలేజీ, మైసూర్ , 26 మే 1916 తేదీ :

మిస్టర్. రాయప్రోలు సుబ్బారావు గారు నాకు వ్యక్తిగతంగా తెలియకపోయినప్పటికీ, నాకు  అతని గద్య మరియు పద్యాలలో అతని స్వంత అద్భుతమైన రచనలు ప్రచురణ లు ద్వారా  సాధారణ స్నేహితులు అందరికంటే ఎక్కువగానే తెలుసు. అతను ఆధునిక తెలుగు కవులలో ఉన్నత గుర్తింపును కలిగి ఉన్నాడు, మరియు ఆంధ్ర సాహిత్య వికాసంలో ఒక కొత్త యుగాన్ని గుర్తుచేసే ఒక కొత్త కవితా పాఠశాల స్థాపకుడిగా ఆయనకు ప్రశంసలు లభిస్తాయని నేను భావిస్తున్నాను. అతని ఊహాత్మక  కవితా రచనలు  ఎంతో ఆర్ద్రత కలిగివుంటాయి మరియు అతని పదబంధ శక్తి గొప్పది, దాదాపు ప్రత్యేకమైనది. అతను కనెక్ట్ అయ్యే ఏ సంస్థకైనా పేరు మరియు కీర్తిని తెస్తాడు. అందువల్ల, తెలుగు ప్రజల ప్రశంసలు మరియు ప్రోత్సాహాలకు బిరుదులకు తగిన  అర్హత  ఉన్న మేధావిగా నేను అతనిని నమ్మకంగా తెలుగు వారందరికి  సిఫార్సు చేస్తున్నాను.

సంతకం- సి.ఆర్. రెడ్డి  ఎం.ఏ., ప్రిన్సిపాల్, మహారాజా కాలేజీ,. మైసూర్.


ఈ క్రింది వీడియో యు.  ఆర్.యల్. ల లో రాయప్రోలు గురించి తెలుసుకోండి


Desha Bhakthi Geyaalu | Rayaprolu Subbarao ... - YouTube


‍‌‌దేశభక్తి గేయం జన్మభూమి | Janmabhoomi ...


రాయప్రోలు సుబ్బారావు గారు భావ ...


7 వ తరగతి తెలుగు - శ్రీలు పొంగిన ...


ఈ రోజు సూక్తి :

"The future belongs to those who believe in the beauty of their dreams"

- Franklin D. Roosevelt

Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు &

గ్రూప్ లు చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం

సబ్స్క్రయిబ్ (subscribe) చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups: 

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com




at March 17, 2021 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: మహానుభావులు, రాయప్రోలు సుబ్బారావు
india Lankelapalem, Andhra Pradesh, India
B.DHARMALINGAM
రెసిడెన్సీ లంకెలపాలెం, R. K. Township, Door No.5-14/20. Anakapalli District. A. P., Pin 531019.India.

Saturday, February 13, 2021

గుహలో నివసిస్తున్న 83 ఏళ్ల సాధువు శంకర్ దాస్ స్వామి అయోధ్యలో శ్రీ రామ ఆలయ నిర్మాణానికి 1 కోటి రూపాయలు విరాళం

గుహలో నివసిస్తున్న 83 ఏళ్ల   సాధువు శంకర్ దాస్ స్వామి అయోధ్యలో శ్రీ రామ  ఆలయ నిర్మాణానికి  1 కోటి రూపాయలు విరాళం

100 రూపాయలు విరాళం ఇచ్చి వేల రూపాయలు ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో  స్వామి శంకర్ దాస్ గురించి తెలుసుకోవలసింది ఎంతో ఉంది.

రిషికేశ్ నీలకంట్  పెడల్ మార్గ్‌లో ఉన్న గుహలో నివసిస్తున్న 83 ఏళ్ల సాధువు స్వామి శంకర్ దాస్ అయోధ్యలో శ్రీ  శ్రీ రామ ఆలయ నిర్మాణానికి గాను రూ .1 కోట్లు అందించారు. స్వామి శంకర్ దాస్ మహారాజ్ ను టాట్ బాబా అని కూడా పిలుస్తారు. స్వామి శంకర్ దాస్ తన గురు టాట్ తో బాబా గుహలో లభించే భక్తుల సమర్పణల నుండి ఈ మొత్తాన్ని సేకరించారు. స్వామి శంకర్ దాస్ గత 60 సంవత్సరాలుగా గుహలో నే బాహ్య ప్రపంచం తెలీకుండా నివసిస్తున్నారు.

స్వామి శంకర్ దాస్ బుధవారం ఒక కోటి రూపాయల చెక్కుతో రిషికేశ్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖకు చేరుకోగా, అక్కడి ఉద్యోగులు నివ్వెరపోయారు. బ్యాంక్ ఉద్యోగులు సంత్ స్వామి శంకర్ దాస్ ఖాతాను తనిఖీ చేసి, అతని చెక్కులు సరైనవని కనుగొన్నారు. విరాళం ప్రక్రియను పూర్తి చేయడానికి యూనియన్ అధికారులను బ్యాంకుకు పిలిచారు. బుధవారం స్వామి శంకర్ దాస్ మహారాజ్ ఒక కోటి రూపాయల (One Crore Rupess) చెక్కును ఆర్ఎస్ఎస్ జిల్లా డైరెక్టర్ సుదామా సింఘాల్ కు అందజేశారు. చెక్కును అందజేస్తున్నప్పుడు, స్వామి శంకర్ దాస్ ఈ నిధిని శ్రీ రామ్ ఆలయానికి మాత్రమే జమ చేసినట్లు వివరించారు.

స్వామి శంకర్ దాస్ జీవితం చాల సాధారణం గా ఉంటాది.  అతను గత 60 సంవత్సరాలు గా ఎత్తైన పర్వతాల లో ఉండే గుహలోనే గడుపుతున్నారు . మహర్షి మహేష్ యోగి , విశ్వగురు మహారాజు, మష్ట్రం బాబా, మహేశ్వర స్వామి, విజయేంద్ర సరస్వతి మున్నగువారు అతని జీవితం లో సేకరించిన విరాళాలన్నీ శ్రీ రామ దేవాల నిర్మాణానికి వెచ్చించడం చాల గొప్ప విషయం గా చెబుతున్నారు. ఇతను తన జీవిత కాలం లో గత 40 సంవత్సరాలు గా  ఈ విరాళం సేకరిస్తున్నట్టు చెప్పారు.

ఈ క్రింది వీడియో యు .ఆర్. యల్.ల లో ఇంకా తెలుసు కోండి ...

1 crore for Ram Mandir | swami Shankar Das | daan| Donation


Today's Quote:

"When you know what you want, and want it bad enough, you’ll find a way to get it."
-Jim Rohn

 Note:

దయచేసి కింది ఉదహరించిన నా బ్లాగులు, చాన్నేళ్ళు, పేస్ బుక్ పేజీ లు పూర్తిగా చివరి వరకు చూడండి లైకు,షేర్. చేయండి. నోటిఫికెషన్ ల కోసం సబ్స్క్రయిబ్ చేయండి 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin Facebook Groups: 

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My Facebook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com




at February 13, 2021 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: 1 కోటి విరాళం, అయోధ్య విరాళం, మహనీయులు, మహానుభావులు, శంకర్ దాస్, సాధువు
india Lankelapalem, Andhra Pradesh, India
B.DHARMALINGAM
రెసిడెన్సీ లంకెలపాలెం, R. K. Township, Door No.5-14/20. Anakapalli District. A. P., Pin 531019.India.

Monday, July 27, 2020

ప్రసిద్ధ భారతీయ నటుడు సోనూ సూద్ జీవిత చరిత్ర అతని సాంఘిక సేవాభావం గురించి తెలుసుకుందాం


ప్రసిద్ధ భారతీయ నటుడు సోనూ సూద్ జీవిత చరిత్ర అతని సాంఘిక సేవాభావం గురించి తెలుసుకుందాం

సోనూ సూద్ ఒక భారతీయ నటుడు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటించాడు. నాటకాలలో కూడా నటించాడు. తెలుగులో అరుంధతి చిత్రానికి ఉత్తమ ప్రతినాయకునిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు.

సోనూ సూద్ పంజాబ్ లోని మోగ అనే అనే పట్టణంలో జన్మించాడు. నాగపూర్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తరువాత మోడలింగ్, ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ చేసేవాడు. అప్పుడే సినిమాల్లోకి వెళ్ళాలనే కోరిక బలపడింది. ఒక నెలరోజులు నటనలో శిక్షణ తీసుకున్నాడు.

తమిళ సినిమా కుళ్ళళలగర్  1999 లో   సౌమ్య నారాయణ అనే పూజారి పాత్రతో చిత్రరంగంలోకి ప్రవేశించాడు. తరువాత మరో తమిళ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా నటించాడు. తరువాత  2000లో శివనాగేశ్వరరావు  దర్శకత్వంలో వచ్చిన హ్యాండ్సప్  అనే సినిమాలో నటించాడు. కానీ బాలీవుడ్ సినిమాలో నటించాలని కోరిక ఉండేది. 

2002 లో వచ్చిన షాహిద్-ఏ-ఆజం అనే హిందీ సినిమాలో భగత్ సింగ్ పాత్ర పోషించాడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ లో అభిషేక్ బచ్చన్ తమ్ముడిగా నటించాడు. తరువాత నాగార్జున సరసన సూపర్ సినిమాలో హైటెక్ దొంగ గా నటించాడు. అరుంధతి సినిమాలో పశుపతి పాత్రతో మంచి పేరు సాధించాడు. ఆ సినిమాకు ఉత్తమ విలన్ గా నంది పురస్కారం లభించింది

ఇతను నటించిన తెలుగు చిత్రాలు

  • సీత (2019)

  • అబినేత్రి (2016)

  • ఆగడు (2014)

  • జులాయి (2012)

  • ఊ కొడతారా ఉలిక్కి పడతారా (2011)

  • తీన్ మార్ (2011)

  • కందిరీగ (2011)

  • దూకుడు (2011)

  • శక్తి (2011)

  • అరుంధతి (2009)

  • ఆంజనేయులు (2009)

  • ఏక్ నిరంజన్ (2009)

  • నేనే ముఖ్యమంత్రినైతే (2009)

  • మిస్టర్ మేధావి (2008)

  • అశోక్ (సినిమా) (2006)

  • చంద్రముఖి (2005)

  • అతడు (2005)

  • సూపర్ (సినిమా) (2005)

  • అమ్మాయిలు అబ్బాయిలు (2003)

హిందీ చిత్రం 

  • జోధా అక్బర్ (2009)

గెలుచుకున్న ప్రత్యేక  అవార్డులు 


రఘుపతి వెంకయ్య అవార్డు బంగారునంది అవార్డు గెలుచుకున్నారు

సోను సూద్ సేవ కార్యక్రమాలు 


కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించారు. ఈ లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు చాలా అవస్థలు పడ్డారు వారికీ ఎన్నో రకాలు గా సహాయ సహకారాలు అందించి దేశానికీ, ప్రపంచానికి కె రియల్ హీరో గా మారారు.

ఈ మధ్య చిత్తూర్ జిల్లాలో నాగేశ్వర రావు అనే రైతు కుటుంబం ఎద్దులు కొనలేక  తమ కూతుర్ల తో పొలం దున్నించడం చూసి చలించి పోయారు.  వెంటనే ట్రాక్టర్ ను ఆ కుటుంబానికి పంపించారు. దేని తో అతనికి టీవీ ఛానల్ ల లోను ట్విట్టర్ లోను ప్రశంసల వర్షం కురుస్తుంది . మీరే చూడండి ...


Two hearts

Two hearts
ఐశ్వర్య Pawan kalyan
@Aishwarya_Pspk
·
9h



#HBDsonusood Happy Birthday
@SonuSood
Sir, What You Have Done so far will be written in golden lines in Our heart
Beating heart
.




N Chandrababu Naidu #StayHomeSaveLives
@ncbn
·
Jul 26
Spoke with
@SonuSood
ji & applauded him for his inspiring effort to send a tractor to Nageswara Rao’s family in Chittoor District. Moved by the plight of the family, I have decided to take care of the education of the two daughters and help them pursue their dreams.


Devendar y m 
Flag of India
@devtony85
·
Jul 26
#SonuSoodRealHero this guy surely deserves a humanitarian award Hope GOI recognizes his efforts towards society
@SonuSood

@PMOIndia




Dev Sumit Singh
@devsumitsingh
·
Jul 26
Like Sonu Sood sir ... A man with pure hurt
@SonuSood
U r great inspiration to millions of people n god in the eye of many people...
❤
Ek hi to dil h sir kitni bar jitoge....#SonuSoodRealHero

Image
2
37
61








Team POWER SENA
@PSPKFollowerDSP
·
25m
Within hours after saying, #SonuSood Anna sends a tractor to a farmer in chittor. Who used his daughters to plough as he doesn't have money to rent bulls.
@SonuSood
Anna responded after watching that viral video that he'll be sending a tractor to them.



Folded hands
#SonuSoodRealHero
Quote Tweet
Team POWER SENA
@PSPKFollowerDSP
· 29m
With the help of @SonuSood Anna. Around 1500 medical students who were stranded in Kyrgyzstan, were brought back to india...
Folded hands
Folded hands
Folded hands
@SonuSood Anna
Red heart
Smiling face with smiling eyes
Red heart
14 views
0:02 / 0:26
1



Saswat Panda
@Saswat_panda21
·
Jul 26
Thank you
@SonuSood
sir for all the help you r doing to the society in this pandemic, from reel life villain to real-life superhero #SonuSoodRealHero #sonusoodthehero

Image
4
310
801







సోను సూద్ గురించి ఈ క్రింది వీడియో యు. ఆర్.యల్ ల లో చూడండి

శోథన ఫలితాలు

Reel Vs Real : Sonu Sood Exclusive Interview With ... - YouTube


సోనుసూద్ బయోగ్రఫీ | Sonu Sood biography - YouTube

Sonu Sood Biography in Telugu | Bollywood Actor Sonu Sood ...


Sonu Sood Gifts New Tractor to Poor Farmer In Chittoor | NTV ...

Sonu Sood Height, Age, Wife, Children, Family, Biography ...

Sonu Sood Gifts New Tractor to Poor Farmer In Chittoor | NTV .

సోను సూద్ ని ట్విట్టర్ లో ఫాలో కండి

https://twitter.com/SonuSood 


https://twitter.com/i/status/1287634863630123009

సోను సూద్ ని facebook లో ఫాలో కండి


https://www.facebook.com/ActorSonuSood/


Note:

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి,  నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి.   అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి. 
అలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like,share and subscribe  చేయండి. 
అలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like,share and subscribe  చేయండి.  Also see my  Youtube channel  bdl 1tv  like, share  and subscribe,
Also see my  Youtube channel bdl telugu tech-tutorials like, share and Subscribe,   కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్, షేర్, లైక్  మాకెంతో మేలు చేస్తుంద, థాంక్యూ.

శోథన ఫలితాలు

















at July 27, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: itsgreatindia, మహనీయులు, మహానుభావులు, సామజిక సేవ, సోనూ సూద్
india Lankelapalem, Andhra Pradesh, India
B.DHARMALINGAM
రెసిడెన్సీ లంకెలపాలెం, R. K. Township, Door No.5-14/20. Anakapalli District. A. P., Pin 531019.India.
Older Posts Home
Subscribe to: Posts (Atom)

Most Recent

భారతీయ నాట్య కళాకారుడు, గురువు, రచయిత, సంగీత శాస్త్రవేత్త, మరియు నాట్య పునరుద్ధారకుడు నటరాజ రామకృష్ణ

భారతీయ నాట్య కళాకారుడు, గురువు, రచయిత, సంగీత శాస్త్రవేత్త, మరియు నాట్య పునరుద్ధారకుడు నటరాజ రామకృష్ణ   నటరాజ రామకృష్ణ (1923–2011) భారతీయ నాట...

Latest

  • భారతీయ నాట్య కళాకారుడు, గురువు, రచయిత, సంగీత శాస్త్రవేత్త, మరియు నాట్య పునరుద్ధారకుడు నటరాజ రామకృష్ణ
    భారతీయ నాట్య కళాకారుడు, గురువు, రచయిత, సంగీత శాస్త్రవేత్త, మరియు నాట్య పునరుద్ధారకుడు నటరాజ రామకృష్ణ   నటరాజ రామకృష్ణ (1923–2011) భారతీయ నాట...
  • నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు గారి వివరాలు
    నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు గారి వివరాలు  రాయప్రోలు సుబ్బారావు గారు   నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన  రాయప్రోల...

ప్రదేశాలు

  • Home
  • మహనీయులు
  • చిరస్మరణీయులు
  • చలన చిత్రాలు
  • ప్రదేశాలు

Followers

Search This Blog

శోధిని

”శోధిని”



Translate

Total Pageviews

Followers

About Me

My photo
B.DHARMALINGAM
రెసిడెన్సీ లంకెలపాలెం, R. K. Township, Door No.5-14/20. Anakapalli District. A. P., Pin 531019.India.
View my complete profile

Report Abuse

Labels

  • 1 కోటి విరాళం
  • aajay surthi
  • Abigna Anad
  • abigna predictions
  • Amit Agrawal
  • baber ali
  • child astrolger
  • child prodigie
  • chorona virus-19
  • Doctor Abijit sonawale
  • doctor for begger
  • drop dead indian social server
  • Education
  • Gitanjali
  • greatindian
  • harsh agarwal
  • IIT professor Alok Sagar
  • itsgreatindia
  • itsgreatindia.blogspot.com
  • kannada boy
  • labnol.org
  • poetry
  • pradeep goyal
  • puna
  • shradha sharma
  • siddesh
  • Sr. NTR
  • sr.N.T.R.movies part 2
  • Sr.NTR
  • technical blog
  • top indian blogger
  • top Indian bloggers
  • voluntary fire fighter
  • wowitstelugu
  • అడమ్స్ వరల్డ్ స్కూల్‌
  • అన్వేష రాయ్
  • అంబేద్కర్ కొటేషన్స్
  • అంబేద్కర్ జీవితం
  • అంబేద్కర్ విగ్రహం
  • అయోధ్య విరాళం
  • ఆకృతి జాస్వాల్
  • ఇండియన్ ఆర్మీ
  • ఇన్‍ఫోసిస్ సుధామూర్తి
  • ఓం శబ్దం
  • ఓంకారనాథ్ శర్మ
  • కన్నడ కుర్రాడు
  • కల్నల్ సోఫియా ఖురేషి బయోగ్రఫీ
  • చలన చిత్రాలు
  • చిన్న వయసులోనే ప్రధానోపాధ్యాయుడు
  • చిరస్మరణీయులు
  • చీనాబ్ వంతెన
  • తెలుగుమహిళప్రొఫెసర్ itsgreatindia
  • నాట్య కారుడు నటరాజ రామకృష్ణ
  • పద్మశ్రీ సుధామూర్తి
  • ప్రదేశాలు
  • ప్రొఫెసర్ మాధవి లత
  • బాబర్ అలీ
  • బాల మేధావి
  • బిపిన్ గనట్రా
  • భారతదేశం లో లోహగఢ్ కోట
  • భారత్ మిలిటరీ
  • మహనీయుడు
  • మహనీయులు
  • మహానుభావుడు
  • మహానుభావులు
  • మిస్ యూనివర్స్ 2021
  • మెడిసిన్ బాబా
  • రవీంద్రనాధ్ టాగోర్ గీతాంజలి
  • రాయప్రోలు సుబ్బారావు
  • లోహాగడ్
  • శంకర్ దాస్
  • సంగీత శాస్త్రవేత్త
  • సాధువు
  • సామజిక సేవ
  • సిద్దేశ్ సాహసం
  • సీనియర్ NTR పూర్తి చిత్రాలు
  • సీనియర్ యన్.టి.ఆర్
  • సుర్వీర్ అవార్డు greatindian
  • సోనూ సూద్
  • హర్నాజ్ కౌర్ సంధు

Blog Archive

  • June 2025 (2)
  • May 2025 (1)
  • April 2025 (1)
  • January 2022 (1)
  • March 2021 (2)
  • February 2021 (1)
  • January 2021 (1)
  • December 2020 (1)
  • July 2020 (2)
  • June 2020 (1)
  • April 2020 (4)
  • March 2020 (1)
  • January 2020 (1)
  • November 2019 (6)
Simple theme. Powered by Blogger.