Showing posts with label సిద్దేశ్ సాహసం. Show all posts
Showing posts with label సిద్దేశ్ సాహసం. Show all posts

Tuesday, November 19, 2019

మహానుభావుడు సిద్దేశ్ అనే భారత దేశపు కన్నడ కుర్రాడి సాహసం గురించి తెలుసుకొందాం రండి

మహానుభావుడు సిద్దేశ్ అనే  భారత దేశపు  కన్నడ కుర్రాడి సాహసం గురించి తెలుసుకొంటే మనం ఆశ్చర్యపోతాం 



సరిగ్గా పదేళ్లు కూడా నిండని ఓ పిల్లాడు 850 మంది ప్రాణాలు కాపాడాడు. ఓ పిల్లాడు అంతమంది ప్రాణాలు కాపాడడమేంటని అనుకుంటున్నారా? నమ్మకం కలగడం లేదా? మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఇది చదవండి. ఆశ్చర్య పోతారు మీరే ...

సిద్దేశ్ అనే కన్నడ కుర్రాడు ఓ రోజు రైల్వే ట్రాక్ దాటుకుంటూ వెళుతున్నాడు. ఆ సమయంలో రైలు పట్టాలు ఊడిన దృశ్యాన్ని గమనించాడు. పట్టాలు ఊడిన విషయాన్న తన తండ్రికి చెప్పి, తండ్రితో పాటు కొంతమంది స్థానికులను కూడా అక్కడికి తీసుకొచ్చాడు. వాళ్లంతా ట్రాక్‌ను పరిశీలిస్తుండగా అదే సమయంలో ఆ ట్రాక్ పై భారీ శబ్దం చేసుకుంటూ హరిహర- చిత్రాంగద ప్యాసింజర్ రైలు దూసుకొస్తోంది. 

ఎవరిదగ్గరైనా ఎరుపు వస్త్రం ఉంటే ఈ ప్రమాదాన్ని ఆపవచ్చని అక్కడున్న ఓ వ్యక్తి అన్నాడు. ఆ మాటలు విన్న సిద్దేశ్ ట్రైన్‌కు ఎదురుగా పరుగెత్తాడు. ఎందుకంటే తాను వేసుకున్న చొక్కా ఎరుపు రంగుదే కాబట్టి. వెంటనే చొక్కా విప్పేసి, దాన్ని ఊపుకుంటూ రైలు ఎదురుగా పరుగుతీశాడు.


సిద్దేశ్ వెనుక అతడి తండ్రి, ఊరి ప్రజలు కూడా కదిలారు. సిద్దేశ్ ఊపుతున్న ఎర్ర చొక్కాను గమనించిన ట్రెయిన్ లోకో పైలట్ వెంటనే బ్రేక్ వేసి, రైలును ఆపాడు. ఆ రైలులో 850 మంది ప్రయాణికులు ఉన్నారు. జరిగిన విషయం తెలిసి ప్రయాణికులందరూ సిద్దేశ్‌కు దండం పెట్టి, అభినందించారు. తమ ప్రాణాలు కాపాడినందుకు సిద్దేశ్‌ను పలువురు ప్రశంసలతో ముంచెత్తారు

2016 న కర్ణాటక ప్రభుత్వం ధైర్యశాలి అవార్డును ప్రదానం చేసింది. అవార్డు అందుకున్న సమయంలో సిద్దేశ్ చెప్పిన మాటలు వింటే నిజంగా చప్పట్లు కొట్టకుండా ఉండలేం. పదేళ్లు కూడా నిండని మన సాహస బాలుడు ఏమి చెప్పాడంటే..

 ‘‘ప్రమాదాన్ని ఎలాగైనా ఆపి, ప్రయాణికుల్ని కాపాడాలని నా మనసులో గట్టిగా అనుకున్నా. అందుకే ఆ సమయంలో నాకు భయం వేయలేదు.” ఒక వేళ నేను ఆలస్యం చేసినా... సమాచారాన్ని చేరవేయడంలో ఆలస్యం చేసిన ఈ పాటికి 850 మంది ఏమయ్యే వారో అంటూ స్టేజ్ దిగాడు. 

పదేళ్లకే ఇంతటి ధైర్యాన్ని ప్రదర్శించిన సిద్దేశా నువ్వు గ్రేట్ అనకుండా ఎవరుంటారు చెప్పండి.

ఈ క్రింది యూట్యూబ్ వీడియోలు చూసి ఇతడి గురించి మరింత తెలుసుకోండి.

Search Results

Child heroes: 9 year old stops train derailment by warning ...


Note:
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే itsgreatindia.blogspot.com  like,share and subscribe చేయండి.
అలాగే నా  ఇంకో బ్లాగ్ wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి.
నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి
అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి.
Also see my  You tube channel  bdl 1tv  like, share  and Subscribe, కామెంట్ చేయడం మర్చిపోకండి.  
మీ కామెంట్ , షేర్ , లైక్  నా కెంతో మేలు చేస్తుంది, థాంక్యూ.









Most Recent

భారతీయ నాట్య కళాకారుడు, గురువు, రచయిత, సంగీత శాస్త్రవేత్త, మరియు నాట్య పునరుద్ధారకుడు నటరాజ రామకృష్ణ

భారతీయ నాట్య కళాకారుడు, గురువు, రచయిత, సంగీత శాస్త్రవేత్త, మరియు నాట్య పునరుద్ధారకుడు నటరాజ రామకృష్ణ   నటరాజ రామకృష్ణ (1923–2011) భారతీయ నాట...

Latest