Tuesday, November 19, 2019

మహానుభావుడు సిద్దేశ్ అనే భారత దేశపు కన్నడ కుర్రాడి సాహసం గురించి తెలుసుకొందాం రండి

మహానుభావుడు సిద్దేశ్ అనే  భారత దేశపు  కన్నడ కుర్రాడి సాహసం గురించి తెలుసుకొంటే మనం ఆశ్చర్యపోతాం 



సరిగ్గా పదేళ్లు కూడా నిండని ఓ పిల్లాడు 850 మంది ప్రాణాలు కాపాడాడు. ఓ పిల్లాడు అంతమంది ప్రాణాలు కాపాడడమేంటని అనుకుంటున్నారా? నమ్మకం కలగడం లేదా? మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఇది చదవండి. ఆశ్చర్య పోతారు మీరే ...

సిద్దేశ్ అనే కన్నడ కుర్రాడు ఓ రోజు రైల్వే ట్రాక్ దాటుకుంటూ వెళుతున్నాడు. ఆ సమయంలో రైలు పట్టాలు ఊడిన దృశ్యాన్ని గమనించాడు. పట్టాలు ఊడిన విషయాన్న తన తండ్రికి చెప్పి, తండ్రితో పాటు కొంతమంది స్థానికులను కూడా అక్కడికి తీసుకొచ్చాడు. వాళ్లంతా ట్రాక్‌ను పరిశీలిస్తుండగా అదే సమయంలో ఆ ట్రాక్ పై భారీ శబ్దం చేసుకుంటూ హరిహర- చిత్రాంగద ప్యాసింజర్ రైలు దూసుకొస్తోంది. 

ఎవరిదగ్గరైనా ఎరుపు వస్త్రం ఉంటే ఈ ప్రమాదాన్ని ఆపవచ్చని అక్కడున్న ఓ వ్యక్తి అన్నాడు. ఆ మాటలు విన్న సిద్దేశ్ ట్రైన్‌కు ఎదురుగా పరుగెత్తాడు. ఎందుకంటే తాను వేసుకున్న చొక్కా ఎరుపు రంగుదే కాబట్టి. వెంటనే చొక్కా విప్పేసి, దాన్ని ఊపుకుంటూ రైలు ఎదురుగా పరుగుతీశాడు.


సిద్దేశ్ వెనుక అతడి తండ్రి, ఊరి ప్రజలు కూడా కదిలారు. సిద్దేశ్ ఊపుతున్న ఎర్ర చొక్కాను గమనించిన ట్రెయిన్ లోకో పైలట్ వెంటనే బ్రేక్ వేసి, రైలును ఆపాడు. ఆ రైలులో 850 మంది ప్రయాణికులు ఉన్నారు. జరిగిన విషయం తెలిసి ప్రయాణికులందరూ సిద్దేశ్‌కు దండం పెట్టి, అభినందించారు. తమ ప్రాణాలు కాపాడినందుకు సిద్దేశ్‌ను పలువురు ప్రశంసలతో ముంచెత్తారు

2016 న కర్ణాటక ప్రభుత్వం ధైర్యశాలి అవార్డును ప్రదానం చేసింది. అవార్డు అందుకున్న సమయంలో సిద్దేశ్ చెప్పిన మాటలు వింటే నిజంగా చప్పట్లు కొట్టకుండా ఉండలేం. పదేళ్లు కూడా నిండని మన సాహస బాలుడు ఏమి చెప్పాడంటే..

 ‘‘ప్రమాదాన్ని ఎలాగైనా ఆపి, ప్రయాణికుల్ని కాపాడాలని నా మనసులో గట్టిగా అనుకున్నా. అందుకే ఆ సమయంలో నాకు భయం వేయలేదు.” ఒక వేళ నేను ఆలస్యం చేసినా... సమాచారాన్ని చేరవేయడంలో ఆలస్యం చేసిన ఈ పాటికి 850 మంది ఏమయ్యే వారో అంటూ స్టేజ్ దిగాడు. 

పదేళ్లకే ఇంతటి ధైర్యాన్ని ప్రదర్శించిన సిద్దేశా నువ్వు గ్రేట్ అనకుండా ఎవరుంటారు చెప్పండి.

ఈ క్రింది యూట్యూబ్ వీడియోలు చూసి ఇతడి గురించి మరింత తెలుసుకోండి.

Search Results

Child heroes: 9 year old stops train derailment by warning ...


Note:
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే itsgreatindia.blogspot.com  like,share and subscribe చేయండి.
అలాగే నా  ఇంకో బ్లాగ్ wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి.
నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి
అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి.
Also see my  You tube channel  bdl 1tv  like, share  and Subscribe, కామెంట్ చేయడం మర్చిపోకండి.  
మీ కామెంట్ , షేర్ , లైక్  నా కెంతో మేలు చేస్తుంది, థాంక్యూ.









Sunday, November 10, 2019

మహనీయుడు ఓంకారనాథ్ శర్మ మెడిసిన్ బాబా గురించి తెలుసుకుందామా

మహనీయుడు ఓంకారనాథ్ శర్మ మెడిసిన్ బాబా గురించి  తెలుసుకుందామా



ఆపదలలో ఉన్న వారిని  ఆదు కోవాలంటే రాజకీయ నాయకులో లేదా బాగా డబ్బున్నవారు అవనవసరం లేదు మంచి మనసుంటే చాలు అని నిరూపిస్తున్నాడు ఇతను.

ఇతని  పేరు ఓంకారనాధ్ శర్మ వాడగా మిగిలిన  మందులు సేకరించి  అవసరమైన  వారికీ ఉచితంగా ఇస్తారు . ప్రతి రోజు ఇంటింటికి తిరిగి తము వాడగా మిగిలిన మందులు ఏవైనా ఉంటె దానం చేయమంటారు . ఆ మందులు ఎక్సపైర్ అయినవి తీసివేసి ఏ వ్యాధి మందులు ఆ వ్యాధికి ఏరి ఉంచుతారు . డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్  ప్రకారం తగిన తగిన మందులు ఇస్తారు. 

2008 ఢిల్లీ లోని మెట్రో బ్రిడ్జి కూలి పోయి నప్పుడు గాయపడిన వారికీ సరిఅయిన మందులు దొరక లేదు. ప్రాధిమిక చికిత్స కూడా దొరక లేదు . దీనితో చలించిన ఓంకారనాధ్  మందుల సేకరణ ప్రారంభించి దానిని ఒక ఉద్యమంగా నడుపుతున్నారు. 

  • నొయిడాలో బ్లడ్ బ్యాంకు లో పని చేసి రిటైర్ అయ్యారు .
  • 1940 లో ఇండియా లో జన్మించారు.
  • ఇతనికి వివాహమై ఒక వికలాంగుడైన కుమారుడు ఉన్నాడు. 

అవార్డులు :

ఇతని ఉద్యమ స్ఫూర్తిని గుర్తించి న ప్రపంచం ఇతనికి అనేక అవార్డులు ఇచ్చింది 

  • ఢిల్లీ గౌరవ్ 2016 లో లభించింది 
  • ముంబై లో సుర్వీర్ అవార్డు 2017 లో లభించింది.
  • medicinebaba.org అనే ఒక వెబ్సైటు  ప్రారంభించారు
Awesome Image

EMAILaddress:-


TRUST NO.   +91-8130778130     (10 AM to 6 PM)


    చాలామంది ఇతని ఉద్యమ స్ఫూర్తి ని గుర్తించి మందులు కొరియర్ లో అతని చిరునామాకు పంపిస్తుంటారు . 
    మీదగ్గర కూడా ఏవైనా మందులు మిగిలినవి ఉంటె ఈ క్రింది చిరునామాకు పంపించండి 

    ఇతని చిరునామా :-

    ఓంకారనాధ్ శర్మ,
    B -180,
    STREE NO 18,
    MANDYALI GALLI,
    MANALAPURI PHASE -II
    DELHI- 110045, 
    INDIA.

    Ph. No. 092502 43298

    ఇంకా ఇతని గురించి యూట్యూబ్ వీడియో యు ఆర్. యల్.ల లో తెలుసుకోండి ..

      Note:
      నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే 
      itsgreatindia.blogspot.com  like,share and subscribe చేయండి
      అలాగే నా  ఇంకో బ్లాగ్ wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి
      నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి
      అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి.
      Also see my  You tube channel  bdl 1tv  like, share  and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి.
      మీ కామెంట్ , షేర్ , లైక్  నా కెంతో మేలు చేస్తుంది, థాంక్యూ.








      Saturday, November 9, 2019

      బిపిన్ గనట్రా మనదేశపు మహామనిషి స్వచ్చంద ఫైరిఫైటర్

      మనదేశపు మహామనిషి స్వచ్చంద  ఫైరిఫైటర్  బిపిన్  గనట్రా 





      మనదేశం లో దేశం కోసం స్వచ్చందం గా పనిచేసే అరుదైన వ్యక్తి  యితడు. ఇతనే  బిపిన్  గనట్రా . ఎక్కడ కోల్ కత్తా  లో అగ్నిప్రమాదాలు సంభవించిన ఇతనే ముందుటాడు. చిన్నపటినుంచి అగ్ని బాధితులను  ఆదుకోవడం విపరీతమైన ఆసక్తి .  1982 లో ఇతనికి 12 ఏండ్ల వయసు ఉండగా  ఇతని అన్నగారు మోటార్ సైకిల్ సిలిండర్  లోంచి  వచ్చిన  స్పార్క్  తో మరణించాడు . అప్పటి నుంచి అగ్ని బాధితుల్ని ఆదుకోవడం  ఒక కర్తవ్యమ్  గా  మలచుకున్నారు . ఇతనిది ప్రభుత్వ ఉద్యోగం కాదు . స్వచ్చందంగా పనిచేస్తుంటాడు.
      • పుట్టిన స్థలము   కోల్ కత్తా   పశ్చిమ బెంగాల్ రాష్ట్రము, 
      • 1957 లో  పుట్టారు . 62  సంవత్సరాలు, 
      • ఎలక్ట్రీషియన్ గా ప్రైవేట్ వృత్తి చేసేవారు .
      • స్ట్రాండ్ రోడ్ లో సీలిండర్లు పేలి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఇతను  చాల  మందిని రక్షించడమే కాకుండా తాను కూడా చాల గాయపడ్డాడు . 
      • ప్రాణాలతో చెలగాట మైన కూడా  స్వచ్చంద సేవను కొన సాగిస్తూనే ఉన్నారు .
      • 2017 లో   భారత దేశపు  పద్మ భూషణ్ పొందారు  అవార్డు పొందారు .
      • 100 పైగా అగ్ని ప్రమాదాలలో పాల్గొన్నాడు. చాల ప్రాణాలను ఆస్తులను కాపాడాడు .
      • ఒక సారి   నిండు గర్భిణిగా ఉన్న స్త్రీని మంటల లోంచి రక్షించడం ఇతని గొప్ప సాహస చర్య .
      • అగ్ని మాపక అధికారులు కు ఎందులోనూ తీసిపోని విధం గా అగ్ని మాపక ఇచ్చారు తంగా ఇతనికి అగ్ని మాపక  దళకాకి యూనిఫామ్ ఇచ్చారు .
      • అగ్ని ప్రమాదాలు   ఎప్పుడు సంభవించిన టెలి విషన్ , రేడియో ఎక్కువగా ఇతని గురించే చెప్పేవారు .
      • ఇతని సాహసాన్ని గుర్తించి అగ్ని మాపక  దళానికి అరుదుగా లభించే స్టీల్ వాలంటీర్ కార్డు ఇచ్చారు. 
      • ప్రజలు అగ్ని చెలరేగిన ప్రదేశానికి చేర్చడానికి తమ వాహనాలిని సమకూర్చేవారు .

      ఇలాంటి మహనీయులిని మనమెప్పటికీ మరచిపోలేము. బిపిన్ గనట్రా ఇప్పటికి తన  సేవలను కొన సాగిస్తూనే ఉన్నారు .  

      ఈ క్రింది యు ట్యూబ్ . యు .ఆర్. యల్ . లో ఇతని వీడియోలు చూడండి  ..







      Note: 

      నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే 
      itsgreatindia.blogspot.com  like,share and subscribe చేయండి
      అలాగే నా  ఇంకో బ్లాగ్ wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి
      నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి
      అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి.
      Also see my  You tube channel  bdl 1tv  like, share  and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి.
      మీ కామెంట్ , షేర్ , లైక్  నా కెంతో మేలు చేస్తుంది, థాంక్యూ.











      Wednesday, November 6, 2019

      భారదేశపు మహామనిషిసామజిక శాస్త్రవేత్త ఆబిడ్ సూర్తి గురించి మనం తెలుసుకోవాలిసింది ఎంత ?

      భారదేశపు మహామనిషి సామజిక శాస్త్రవేత్త  ఆబిడ్ సూర్తి గురించి మనం తెలుసుకోవాలి సింది ఎంత?

      ముంబైలో ప్రతి అపార్ట్మెంట్ ఇంటి తలుపు తట్టి మీ ఇంట్లో వాటర్ లీక్ అవుతుందా అని అడిగి మరీ ఉచితం గా కుళాయిలు రిపేర్   చేసే వ్యక్తి  ఎవరైనా ఉన్నారు అంటే తను  అబిద్ సూర్తి  అనే చెప్పుకోవాలి. ముంబై లో నీటి కి వచ్చే కొరత కు ఇతను చలించి పోయాడు

      అనేక మంది ఇళ్లల్లో కుళాయిలు సరిగా కట్టక పోవడం. కుళాయి బాగుచేయించుకోవడానికి సమయానికి ప్లంబర్  దొరకక పోవడం చూసి తానే ఈ యజ్ఞానికి పూనుకున్నాడు . రోజు పొద్దునే లేసి ఒక్క ఏరియా ను ఎంచుకొని వారి ఇండ్లలో ఉన్న కుళాయిలు బాగుచేస్తాడు. చేసిన తరువాత ఎవరిని డబ్బులు అడగడు . అయితే ముంబై లో నీటి సమస్య ఎంత ఉంది దానిని ఎలా అధిగమించాలో చెబుతాడు . అవకాశముంటే తన పనిలో భాగస్వామ్యం కమ్మంటాడు.   లేదా తమకి చేతనైన సాయం చేయమంటారు.

      అబిద్ సూర్తి "డ్రాప్ డెడ్ " అనే సంస్థను 2007 లో ప్రారంభించి నీటి సమస్యను పారద్రోలడం పై కొంత విజయం సాధించారు . మీరా రోడ్ ముంబైలో ఉన్న కుళాయిల అన్ని సరి చేసారు . ఒకొక్కసారి తానే స్వయం గ  చేస్తే కొన్ని సార్లు ప్లంబర్ లను పిలిపించి తన సొంత డబ్బుల తో చేయిస్తారు .  ఓక చుక్క నీరు వేస్ట్ వల్ల సెకను కు 1.000 లీటర్లు నీరు వృధా అవుతుందని ఇతను చెబుతారు ప్రస్తుత పు  పరిశోధన ద్వారా 4000 కోట్ల లీటర్ల నీరు ప్రతి రోజు  భారత దేశం లో వృధా అవుతుంది. ఇదే విషయాన్ని పొంప్ లెట్ లు ద్వారాను పోస్టరులు ద్వారాను ఇతను  ప్రచారం చేస్తున్నారు.

      • 01. ఇతను  ఒక గొప్ప భారతీయులు  గర్వించదగ్గ  సామజిక వేత్త.
      • 02. గుజరాతీ ముస్లిం మతానికి చెందిన వ్యక్తి .
      • 03..మే 5వ తేదీ 1935 లో ముంబై లో 
      • 04.వావెరా ,గుజరాత్ లో గులాం హుస్సేన్ సకినా  బేగం కు జన్మించారు  
      • 05. ఆర్ట్స్ లో డిప్లొమో చేసారు, కధలు, నాటకాలు స్క్రీన్ ప్లే లు కూడా రచిస్తారు.
      • 06. శరత్ చంద్ర ఛటర్జీ  బెంగాలీ రచయిత  ద్వారా ప్రేరేపితుడు అయ్యారు .
      • 07.హిందీ గుజరాత్ లలో రచనలు చేస్తారు. ఉర్దూ బాగా వచ్చు,
      • 08. ఫ్రీ లాన్సర్ వృత్తి 1965 లో మాసూమా బేగం ను వివాహం చేసుకున్నారు .వీరికి ఇద్దరు పిల్లలు.
      • 09.ఇతను 80 పుస్తకలు రచించారు. వాటిలో  45 నవలలు ,  10 చిన్న కధలు , 7 నాటకాలు ఉన్నాయి.
      • 010.ప్రమోది పాటి'అబిద్ సూరత్ అనే ఒక డాక్యుమెంటరీ ని డైరెక్ట్ చేసారు 
      • 011. 1993 హిందీ సాహిత్య సంస్ధ అవార్డు , గుజరాజ్ గౌరవ్ అవార్డు పొందారు.
      • 012.ఇతని వెబ్సైటు www.aabidsurthi.in  చూసి వివరాలు తెలుసుకోవచ్చు .


      హాట్స్ ఆఫ్ అబిద్ సూర్తి ఇతన్ని చూసి అయినా మనం స్ఫూర్తి ని పొందు దామా ...

      ఈ క్రింది యూట్యూబ్ వీడియోలు చూడండి...


      The Man Who Decided To Be The Change | Abid Surti's Story ...


      Colgate celebrates Water Heroes of India: Aabid Surti - YouTube



      DataBaaz | Aabid Surti: Repairing Leaking Taps To Save ...


      Ghanti Bajao: Abid Surti, The Man Who Catches ... - YouTube


      Note: 

      నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి,

      నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి.

      అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి.

      Also see my  You tube channel  bdl 1tv  like, share  and Subscribe, కామెంట్  చేయడం  మర్చిపోకండి మీ కామెంట్ , షేర్ , లైక్  మాకెంతో మేలు చేస్తుందిథాంక్యూ.













      Most Recent

      భారతీయ నాట్య కళాకారుడు, గురువు, రచయిత, సంగీత శాస్త్రవేత్త, మరియు నాట్య పునరుద్ధారకుడు నటరాజ రామకృష్ణ

      భారతీయ నాట్య కళాకారుడు, గురువు, రచయిత, సంగీత శాస్త్రవేత్త, మరియు నాట్య పునరుద్ధారకుడు నటరాజ రామకృష్ణ   నటరాజ రామకృష్ణ (1923–2011) భారతీయ నాట...

      Latest