Thursday, April 2, 2020

బ్లాగింగు వృత్తి గా చేసుకొని లక్షలు సంపాదిస్తున్న మనదేశపు మహా మనిషి అమిత్ అగ్రవాల్


బ్లాగింగు వృత్తి గా చేసుకొని లక్షలు సంపాదిస్తున్న మనదేశపు మహా మనిషి అమిత్ అగ్రవాల్ 



ఈ కంప్యూటర్ యుగం లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఎన్నోరకాల పనులు ఇంటర్నెట్ ద్వారానే మనం చేసుకో గలుగు తున్నాం. ఆన్లైన్ మార్కెటింగ్ చేయడం. వంటలు చేయడం, ఆద్యాత్మికం, వినోదం, ఇలా ఎన్నో రకాలు చేయగలుగుతున్నాం. వీటన్నిటి ని సులభం చేసేది బ్లాగర్స్, ప్రపంచం లో ని అనేక విషయాలను  తెలిసే లాగా కొన్ని  పేజీలు, పోస్ట్ లు సృష్టించడమే బ్లాగ్గింగు అంటే . 

ఈ బ్లాగులు ప్రపంచలోని వివిధ ప్రాంతాల  వారు చూసి అనేక విషయాలు నేర్చుకుంటారు.  బాగా ప్రజాదరణ  ఉన్న ఈ బ్లాగులకు గూగుల్ సంస్థ వారు ప్రకటనలు ఇస్తారు. ఆ ప్రకటనలు చూసిన, ఆ వస్తువులను  కొన్న కూడా కొంత కమిషన్ బ్లాగ్ అడ్మిన్ కి గూగుల్ సంస్థకి వస్తుంది. ఈ విధంగా బ్లాగర్లు ఆదాయాన్ని సంపాదిస్తారు . ఈ విధంగా మన దేశం లో బ్లాగింగ్ ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న వారిలో అమిత్ అగ్రవాల్ ఒకరు .

 అమిత్ అగ్రవాల్  ఇతని బ్లాగ్  Labnol.org

  • బ్లాగ్ ప్రారంభించిన సంవత్సరం -2004 

  • అలెక్స రాంక్ ప్రపంచం లో  ..15,281

  • labnol డొమైన్ కి .org అనే లింక్ ఉంటుంది,

  • రోజుకి ఆదాయం సుమారుగా $ 1,322 డాలర్లు  సుమారుగా ఇండియన్ కరెన్సీ లో (ఒక రోజుకు ) 1 లక్ష రూపాయలు పైన.

  • గూగుల్ (యాడ్సెన్స్ )ప్రకటనలు ద్వారా ఇతనికి ప్రదానం గా ఆదాయం వస్తుంది.

  • ఇతని బ్లాగ్ విలువ సుమారు $ 9,51,840 డాలర్లు  సుమారు గా 07 కోట్లు.

వ్యకిగత వివరాలు :
  • అమిత్ అగ్రవాల్ ఇండియాలో టెక్నాలజీ సంబందించిన 16 సంవత్సరాలుగా బ్లాగింగ్ లో ప్రసిద్ధి చెందారు.

  • ఢిల్లీ కి 206 కిలోమీటర్లు దూరం లో ఉత్తరప్రదేశ్ లో నివసిస్తున్నారు.

  • IIT-Roorkeeలో (తరువాత REC) లో కంప్యూటర్ సైన్స్ చేసారు.

  • భారత దేశపు  మొట్ట మొదటి నిపుణ బ్లాగర్, అమిత్ అగర్వాల్ 

  • ఇతను ప్రపంచానికి అందించేది విజ్ఞానం చాలా ఎక్కువ. 
  • ప్రతివారం Techy మంగళవారం, అమిత్ అగర్వాల్  యువర్‌స్టోరీ తో మాట్లాడుతుంటాడు.
ఈ క్రింది యు ఆర్. యల్.ల లో ఇతని గురించి తెలుసుకోండి. 





ఈ క్రింది యూట్యూబ్ .యు ఆర్. యల్ .ల లో ఇతని గురించి తెలుసుకోండి 

Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి.

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండి.

నా యూట్యూబ్ ఛానల్   bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.















Tuesday, March 17, 2020

7 సంవత్సరాలకే శస్త్ర చికిత్స చేసిన కుర్రవాడు ఆక్రిత్ జాస్వాల్ గురించి మనం తెలుసుకుందామా

itsgreatindia
7 సంవత్సరాలకే శస్త్ర చికిత్స చేసిన కుర్రవాడు ఆక్రిత్ జాస్వాల్ గురించి మనం తెలుసుకుందామా


అక్రిత్ జాస్వాల్ ఏప్రిల్ 1993 లో భారత దేశం లో జన్మిం చాడు.రాజపుట్ వంశం లో జన్మించిన ఇతడు మెడికల్ కాలేజీ లో ఎప్పుడు చేరకుండానే వైజ్య విజ్ఞానాన్ని అ పరిమితంగా సంపాదించాడు. అందుకే ఇతనిని బాల మేధావి గా పరిగణిస్తున్నారు. యితడు తన 7 వ ఏట నే ఆస్పత్రిలో ఒక క్లిష్టమైన శస్త్ర చికిత్సను చేసి ప్రపంచ వ్యాప్తం గా కీర్తిని సముపార్జించాడు.

  • ఈతని తల్లి రక్తమే ఇతనికి వరం మరియు  ప్రేరణ.చిన్న తనం లో ఇతని తల్లి రక్షా కుమారి జాస్వాల్ ఆకృతి ఉయ్యాల లో నే నడిచేది. 10 నెల లోనే మాట్లాడడం చేసేది. 5 సంత్సరాల వయసులో ఆమె షేక్స్ పియర్ నాటకాన్ని చదివి అర్ధం చేసుకుంది. 8 సంవత్సరాల వయసులో శస్త్ర చికిత్సను చేసింది. కానీ చేతులు కరెంటు షాక్ కు గురి అయి చచ్చు పడి పోవడం తో ఈమె నుండి ఆకృతి జాస్వాల్ ప్రేరణ పొందాడు  

  •  ప్రతిభను గుర్తించిన ఆ ప్రాంతపు డాక్టర్లు ఆపరేషన్ లు చేసేటప్పుడు  ఇతనిని పిలిచేవారు. ఈ విధం గా ఆపరేషన్ లు నిర్వహించడం చూసిన జాస్వాల్ మెడికల్ విజ్ఞానం లో పరిజ్ఞాన్ని సంపాదించాడు. ఇతని పరిజ్ఞానం తెలుసుకున్న ఒక తండ్రి తన్ కూతురికి ఉచితంగా ఆపరేషన్ చేయమని అడిగారు. అతని చేసిన ఆపరేషన్ విజయవంతం అయింది.

  • ఆకృతి జాస్వాల్ మొదటి ఆపరేషన్ విజవంతం అవడం తో భారత దేశం లో కెల్లా సర్జరీ లో  ఓక బాల మేధావిగా ఇతనిని గుర్తించారు. ఇరుగు పొరుగు గ్రామాల వారు ఆపరేషన్ లకు సంబంధించి ఇతనిని సలహాలు అడిగేవారు. 

  • ఆకృతి జాస్వాల్ 11 వ ఏట పంజాబ్ యూనివర్సిటీ లో డిగ్రీ చదవడం ప్రారంభించాడు. యూనివర్సిటీ లో కెల్లా అతి పిన్న వయసులో డిగ్రీ చదివే వ్యక్తి అతనే.  లండన్ ఇంపీరియల్ కాలేజీ ఇతనిని మెడికల్ రీసెర్చ్ ఫై పరిశోధనలు  చర్చలు జరపడానికి ఆహ్వానించింది. ఆకృత్ జాస్వాల్ లక్షల కొద్దీ  వైద్య శాస్త్రీయ సలహాలు  వారికీ ఇచ్చి  ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడు .

  • ఆకృతి జాస్వాల్డ్ రోడ్ పక్కన చికిత్స లేకుండా ఉన్న ఎంతో మంది కాన్సర్ రోగులను అతను చూసి చలించి పోయాడు.  ఇప్పుడు అతను కాన్సర్ నివారణకు అనువైన శస్త్ర చికిత్సల పై పరిశోదన చేస్తున్నాడు. కాన్సర్ కు తగిన చికిత్స కోసమై అతను పరిశోధనలు చేస్తున్నాడు  

  • జీన్ తెరాఫీ అనే ఒక విధానం పైన ఆకృతి జాస్వాల్ ప్రస్తుతం  పరిశోధన చేస్తున్నాడు. చిన్న వయసులోనే  పూజాబ్ యూనివర్సిటీ  లో బి.యస్ .సి లో డిగ్రీ చదివారు   గ్రీ అనాటమీ, సర్జరీ కి సంబందించిన పుస్తకాలు , అనేస్తేషియా, ఫిజియోలజీ, కాన్సర్,  కు సంబందిచిన పరిజ్ఞానం అతను ను చాల సంపాదించాడు. 

  • ప్రతి రోజు 1 గంట చదువుకు కేటాయించడం ఆకృతి జాస్వాల్ అలవాటు.   వీలు కలిగినప్పుడు క్రికెట్, టీవీ చూడడం అతని హాబీ లు . ఇతని ఐ .ఖ్యు 148 ఒకే పరిక్షలో వచ్చింది.  'ది అల్ఫ్రా విన్ఫ్రై ' షో లో అతను  పాల్గొన్నాడు 

  • బ్రిటిష్ డాక్టర్లు కొందరు ఇతని పరిజ్ఞానాన్ని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఇతను కాన్సర్ విరుగుడు మందు కనిపెట్టి మన దేశానికీ పేరు తెస్తాడని ఆశిద్దాం.

ఆకృతి జస్వల  గురించి  ఈ క్రింది వీడియో లింకులు చూడండి :

India's Smartest Boy And His Quest To Cure Cancer 

https://www.youtube.com › watch

Akrit Jaswal 7 Years Old World's Youngest


గమనిక :
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి .   

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like, share  and subscribe  చేయండి.   

నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv  

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.












Friday, January 3, 2020

ప్రపంచం లోనే అతి చిన్న వయసులోనే ప్రధానోపాధ్యాయుడు అయిన వ్యక్తి బాబర్ అలీ గురించి తెలుసుకుందామా

ప్రపంచం లోనే  అతి చిన్న వయసులోనే ప్రధానోపాధ్యాయుడు అయిన  వ్యక్తి బాబర్ అలీ గురించి తెలుసుకుందాము 




బాబర్ అలీ  అతి చిన్న వయసులోనే (16) ప్రధానోపాదయుడైన వ్యక్తి 

జననం :ఇతని జననం 18 మార్చి 1993) పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ ఇండియా 

తల్లి తండ్రులు ఎండి నాసిరుద్దీన్, బానురా బీబీ

ప్రస్తుత విద్య :  బెర్హంపూర్ కృష్ణాత్ కాలేజీ  ఇంగ్లీష్ ఆనర్స్ లో గ్రాడ్యుయేట్ చేసారు .(కళ్యాణి యూనివర్సిటీ పశ్చిమ బెంగాల్ , భారతదేశం లో )మరియు యమ్ .ఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసారు 

వృత్తి ఉపాధ్యాయుడుఅక్టోబరు 2009 లోతన పదహారేళ్ళ వయసులోఅతన్ని "ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన ప్రధానోపాధ్యాయుడుఅని పిలిచారు.

జాతీయత: భారతీయుడు

పురస్కారాలు : రియల్ హీరోస్ అవార్డు 2009,   సి. ఎన్ . ఎన్  .ఐ . బి. యెన్. 

వెబ్సైట్:  www .anandasikshaniketan.in

  • బాబర్ అలీ కి పేదరికం అంటే ఏమిటో తెలుసు. పేదవారు చదివి పైకి రావడం ఎంత కష్టమో కూడా తెలుసు . అందుకే అతడు తన చిన్న తనంలోనే తన ముషిరాబాద్  గ్రామములో ఉచిత విద్య పాఠశాలను తన ఇంటి పెరడులో 7 సంవత్సరాల ప్రాయం లోనే  స్థాపించాడు . పాఠశాల సాయంత్రం 4.00 గంటలకు ప్రారంభమై రాత్రి 8 వరకు కొనసాగుతుంది.
  • ఒక విద్యార్థితో ప్రారంభమైన యితని పాఠశాల క్రమంగా చుట్టుపక్కల 5 కిలోమీటర్లు పైబడిన  గ్రామాల విద్యార్థులు రావడం ప్రారంభించారు. క్రమంగా పాఠశాల బయట స్థాపించబడి 10 మంది టీచర్లు 800 విద్యార్థులతో ఇప్పుడు నడుస్తుంది. 
  • విద్య నేర్పించడానికి టీచర్లు కొంతమంది స్వచ్చందంగా పని చేస్తుంటారు.
  • ఇతని పాఠశాల ప్రభుత్వ గుర్తింపును పొందింది. ఉచిత మధ్యాహ్న భోజన సదుపాయం కూడా కల్పించారు. స్వామి వివేకా నంద నుండి బాబర్ అలీ స్ఫూర్తిని పొందారు. అతని పాఠశాలలో దేశభక్తులు మేధావుల ఫోటోలు ఉంటాయి.
  • 2009 రియల్ హీరోస్ సి .యన్ .యన్ అవార్డు పొందారు.
  • లిటరసీ హీరో అవార్డు యన్ .డి. టీవీ వారు ఇచ్చారు.
  • ఫోర్బ్స్ ఆసియా వారు అండర్ 30 సోషల్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు ఇచ్చారు.
  • బి.బి .సి ఎడ్యుకేషన్ లీడర్ షిప్ అవార్డు అందుకున్నారు .
  • ఇతని బయోగ్రఫీ కర్ణాటక ప్రభుత్వము సి.బి.యస్.సి 10 వ తరగతి( పి .యు.సి.) కోర్స్ లో పాఠ్యము అంశం గా ప్రవేశపెట్టింది.
  • బాబర్  అలీ  అమీర్ ఖాన్  షో 'సత్య మేవ జయతే 'లో 2012 లో  పాల్గొన్నారు
  • అలాగే TED,  INK షో లలో పాల్గొన్నారు. 
ఇతన్ని స్ఫూర్తి గా  తీసుకొని మనం కూడా నిరక్షరాస్యతను తొలగించడానికి మన వంతు ప్రయత్నాన్ని చేద్దామా ..

ఈ క్రింది యు.ఆర్ .యల్.లోఇతని వీడియోలు చూద్దామా?


Success Story of BABAR ALI - The Youngest Headmaster in ...







TEDxSIBMBangalore - Babar Ali, "World's youngest ...



Babar Ali Youngest Headmaster in the World - YouTube



Note: 

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి,
నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి.
అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి.
Also see my  You tube channel  bdl 1tv  like, share  and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి . 
మీ కామెంట్ ,షేర్ , లైక్  మాకెంతో మేలు చేస్తుందిథాంక్యూ



































Saturday, November 30, 2019

'ఓం'తో అలసట మాయం..శాస్త్రీయంగా నిరూపించిన బాలిక మరియు శాస్త్రజ్ఞులు

'ఓం'తో అలసట మాయం..శాస్త్రీయంగా నిరూపించిన బాలిక మరియు శాస్త్రజ్ఞులు

ఓం, ఓమ్, లేదా ఓంకారము త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. 

హిందూమతానికి కేంద్ర బిందువు. పరమాత్మకు శబ్దరూప ప్రతీక. దీనికి నాలుగు పాదాలున్నాయి. అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. 

వాటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం. దాన్ని గ్రహించినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు. ఇదొక ఏకాక్షర మంత్రము. 


హిందువుల నమ్మే ముఖ్యమైన మంత్రం :

అనేక మంది హిందువులు దేవుని పూజించే సమయంలో, తమ మంత్రోచ్చారణ ప్రారంభాన్ని"ఓం" తోనూ మరియు "స్వాహా" తో ముగింపుని ఇవ్వడాన్ని మనం తరచుగా గమనిస్తూనే ఉంటాము. దీనికి గల ప్రధాన కారణమేమిటో మీకు తెలుసా ?

పురాతన హిందూ ఋషుల ప్రామాణికాల ప్రకారం, "ఓం" ప్రధానంగా మూడు శబ్దాలను కలిగి ఉంటుంది. అవి వరుసగా అ, ఉ, మ గా ఉన్నాయి. హిందూ మతం నమ్మకాల ప్రకారం ఈ మూడు అక్షరాలూ, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తాయని తెలుపబడింది.

"ఓం"శబ్దము 

  • శబ్దమే భగవంతుడని చెప్పబడింది. ప్రతిపదము నకు మూలాధారము గా ఒక గుర్తుగా ఉంటే అది ఉత్తమోత్తమ చిహ్నం అవుతుంది. శబ్దోచ్చారణ లో మనం కంఠంలోని స్వరపేటికను,అంగిలినిశబ్ద ఫలకాన్ని ఉపయోగిస్తాము.ఏ శబ్దము నుండి ఇతర శబ్దాలన్నీ వ్యక్తమవుతున్నాయో అలాంటి అత్యంత స్వాభావిక శబ్దము ఏదైనా ఉందాఆ శబ్దమే ప్రణవము లేక ఓంకారము.
  • ఇందులో అ,,మ లు ఉన్నాయి.నాలుకలోనిఅంగిలిలోని ఏ భాగము కూడా ' 'కార ఉచ్చారణ కు తోడ్పడదు. ఇది ఓంకారానికి బీజం గా ఉంది చివరిది ' 'కారము.పెదవులని మూసి దీన్ని ఉచ్చరిస్తారు. నోటిలోని మూలభాగము నుండి అంత్యభాగము వరకు కూడా ఉచ్చారణ సమయములో దొర్లుకుంటూ ఉంటుంది.ఇలా శబ్ద ఉచ్చారణా  ప్రక్రియనంతా   ఓంకారం  తెలియజేస్తూంది. అందువలన ఓంకారాన్ని స్వీకరించడము జరిగింది.

శాస్త్రాలు ఏమి చెప్పాయి :

  • ధర్మ శాస్త్రాల ప్రకారం, విశ్వం (3) మూడు రకాల ప్రాథమిక శక్తులను కలిగి ఉంటుంది. అవి వరుసగా, సత్వ, రజో మరియు తమో గుణాలు. 
  • ఇక్కడ సత్వ గుణం, భగవంతుని లేదా మంచి లక్షణాలను ప్రతిబింబిస్తుంది.
  • రజో గుణం మనిషి లేదా రాజు యొక్క సహజ లక్షణాలకు నిదర్శనం. 
  • తమో గుణం చెడు లేదా రాక్షస లక్షణాలకు సంబంధించినది. 
  • ప్రతి ఒక్క మూలకం కూడా, వివిధ నిష్పత్తులలో ఈ మూడు గుణాలను కలిగి ఉంటుందని చెప్పబడింది.
  • ఈ శక్తుల లేదా గుణాల నిష్పత్తిని మార్చగలిగినా, సమ్మేళనం మాత్రం అలాగే మిగిలిపోతుంది. 

  • ఈ మూడు గుణాల కలయిక ద్రవ్యరాశిగా మారుతుంది. "ఓం" అనే పదం ఈ మూడు గుణాల కలయికగా ఉంటుంది
  • హిందూ గ్రంథాల ప్రకారం, ఓం అనే పదం శివుడిని మరియు వినాయకుడిని కూడా సూచిస్తుంది. 
  • వినాయకుడిని కొన్ని సందర్భాలలో "ఓం" రూపంలో చిత్రీకరించి పూజించడం మనం గమనిస్తూనే ఉంటాం. 
  • దైవ కార్యాన్ని మొదలుపెట్టాలన్నా, హిందూ ఆచారాల ప్రకారం, మొట్టమొదటగా వినాయకుని పూజించడం పరిపాటిగా ఉంటుంది.

  • విశ్వం ఆవిర్భావం జరిగినప్పుడు, ఓం అనే ధ్వని వినిపించిందన్నది పురాతన కాలం నుండి వస్తున్న ప్రధాన నమ్మకం. 
  • విశ్వం ముగింపునకు వచ్చినప్పుడు కూడా అదే ధ్వని వినిపిస్తుందని చెప్పబడింది. 
  • ప్రాధమిక ధ్వనిగా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్న కారణంగా, ఆ శబ్దంతోనే మంత్రోచ్చారణ ప్రారంభించడం కూడా ఆనవాయితీగా వస్తున్నది.

విశిష్టత -అన్వేష రాయ్ పరిశోధన...

ఓం శబ్దంతో శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలుగేళ్ల బాలిక ప్రయోగాత్మ కంగా నిరూపించింది. పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్ లో తన ప్రదర్శనతో బాలిక శాస్త్రవేత్తలను అకట్టుకుంది. కోల్కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది.

  • ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది.

  • అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యం కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు.

  • అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని బాలిక తెలిపింది. ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌన:పున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్మిటర్స్తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి.

  • ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియజేసింది. అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది.

  • ఈ దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు.
  • ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతుందని తమ అన్వేష నిరూపించిందని వెంకట్రామన్ తెలిపారు.

  • ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టలేదని స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు.

  • ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన వర్క్షాప్నకు 165 విద్యార్థులను ఎంపిక చేశామని ఆయన అన్నారు.

  • వర్క్షాప్లో భాగంగా అన్వేష ఉత్తరాఖండ్లో పర్యటించినపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది.

  • అలాగే పూజారులు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది. దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది. దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది.
  • ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్ పౌన:పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది.

17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్డయాక్సైడ్ శాతాలను లెక్కించింది. ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు అన్వేష రాయ్ తెలిపింది.

ఈ క్రింది వీడియోల యు.ఆర్.యల్ . లు .ద్వారా మరింత వివరాలు తెలుసు కోండి


OM Chanting @528 Hz | 8 Hours - YouTube

Search Results

OM MANTRA: MOST POWERFUL TRANSCENDENTAL ...

OM Chanting @417 Hz | Removes All Negative Blocks ...

Om Chanting Meditation : 100 TIMES ! - YouTube

OM MANTRA SOUND OF THE UNIVERSE - YouTube


Note: 

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి,
నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe చేయండి.
అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండి.
Also see my  You tube channel  bdl 1tv  like, share  and Subscribe,   
కామెంట్   చేయడం  మర్చిపోకండి . 
మీ కామెంట్ ,షేర్ , లైక్  మాకెంతో మేలు చేస్తుందిథాంక్యూ


















Most Recent

4. "ప్రపంచాన్ని దయతో గెలిచిన మహానుభావురాలు – మదర్ థెరేస్సా"

Mother Teresa Biography – Life, Awards, and Humanitarian సర్వీసెస్ "ప్రపంచాన్ని దయతో గెలిచిన మహానుభావురాలు – మదర్ థెరేస్సా" Mother...

Latest