రవీంద్రనాధ్ టాగోర్ గీతాంజలి
గురించి అందులో అద్భుతమైన పద్యాల
ను తెలుగు లో అనువాదం చేసి తెలుసు
కొందాం
- గీతాంజలి బెంగాలీ భాషలో వ్రాయబడిన మూల గ్రంథం 103/157 పద్యాల కలగలిపి ఉంది .ఇది 1910, ఆగష్టు 14న ప్రచురింపబడింది.
- ఇంగ్లీషు గీతాంజలి లేదా సాంగ్ ఆఫరింగ్స్ 103 ఆంగ్ల పద్యాల సంకలనం. రవీంద్రనాథ్ ఠాగూర్ తానే స్వయంగా బెంగాలీ పద్యాలను ఆంగ్లం లోనికి తర్జుమా చేశాడు.
- ఈ ఇంగ్లీషు లో గీతాంజలి పోయెట్రీ కొన్ని తరగతుల్లో ఇంగ్లీష్ పోయెట్రీ గా కూడా ఉంది
- మొదటిసారి 1912 నవంబర్ నెలలో లండన్‌లోని ఇండియా సొసైటీ గీతాంజలి పద్యపుస్తకాన్ని ప్రచురించింది.
- ఈ గ్రంథంలో 53 పద్యాలు మూల గ్రంథమైన బెంగాలీ గీతాంజలి నుండి అనువాదం చేయగా తక్కిన 50 పద్యాలు ఇతడు వ్రాసిన నాటకం "అచలయతన్" నుండి మరో ఎనిమిది గ్రంథాలనుండి స్వీకరించి అనువదించాడు.
- మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశమే ఈ గీతాంజలి పద్యాలలో ముఖ్యాంశం.
- ఈ కావ్యంలోని మార్మిక మాధుర్యం, శబ్ద మాధుర్యం, తాత్విక సౌరభం ప్రపంచ ప్రజలను ఆకట్టుకుంది. ప్రకృతి ఈ కావ్య రచనకు రవీంద్రనాథ్ టాగూరుకు ప్రేరణగా నిలించింది.
- అప్పటి రోజుల్లో (1900-1913) భక్తి మార్గం బలంగా ఉండేది. అలాంటి సమయంలో ప్రకృతి ఆరాధన ద్వారా దేవుణ్ణి చేరుకోవడానికి మార్గం ఈ కావ్యం ద్వారా చూపించాడు రవీంద్రనాధ్ టాగోర్
- భక్తితో కూడిన దేశప్రేమ మనకు ఈ పద్యాలలో ఎక్కువగా కనిపిస్తుంది.
- ఇంగ్లీష్ అనువాదాన్ని రవీంద్రనాథ్ టాగూరు 1912లో తన ఇంగ్లాండు పర్యటనకు ముందు వ్రాశాడు.
- ఇంగ్లాండు లోని ప్రజలు ఈ పద్యాలను విపరీతంగా ఆదరించారు.
- 1913లో గీతాంజలి ఇంగ్లీషు అనువాదం కారణంగా రవీంద్రనాథ్ టాగూరు సాహిత్యంలో నోబెల్ బహుమతిని పొందిన మొట్టమొదటి ఐరోపా ఖండేతర వ్యక్తిగా నిలిచాడు.
- పాశ్చాత్య దేశాలలో గీతాంజలి ఎక్కువ ప్రజాదరణను చూరగొనింది. తత్ఫలితంగా ఎన్నో అనువాదాలు వెలువడ్డాయి.
- 20వ శతాబ్దపు ప్రముఖ ఐరిష్ కవి విలియం బట్లర్ ఈట్స్ ఇంగ్లీషు గీతాంజలి 1912 నాటి మొదటి ముద్రణకు పరిచయ వాక్యాలు వ్రాశారు.
Where the world has not been broken up into fragments by narrow domestic walls.
Where words come out from the depth of truth, where tireless striving stretches its arms toward perfection.Where the clear stream of reason has not lost it's way into the dreary desert sand of dead habit.
Where the mind is led forward by thee into ever-widening thought and action. In to that heaven of― Gitanjali
ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో,
ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో,
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో,
సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాలకింద ప్రపంచం
విడిపోలేదో,
ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో,
ఎక్కడ అలసట నెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు జాస్తుందో,
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం
ఇంకిపోకుండా వుంటుందో,
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ, కార్యాలలోకీ
నీచే నడపబడుతుందో,
ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు.
- రవీంద్రనాధ్ టాగోర్
In many a morning and eve thy footsteps have been heard and thy messenger has come within my heart and called me in secret.
It is as if the time were come to wind up my work, and I feel in the air a faint smell of thy sweet presence.
― Gitanjali
కాలపు ఏ చివరి అంచు నుండి నువ్వు నాకోసం వస్తున్నావో నాకు తెలియదు. నీవాళ్ళే అయిన సూర్యుడూ, తారకలూ నిన్ను నా నుండి ఎప్పటికీ మరుగుచేసి ఉంచలేరు.
ఎన్ని ఉదయాలూ సాయంత్రాలూ నీ అడుగుల సవ్వడులు వినిపించాయో1 నీ దూత నా యెదలోకి వచ్చి ఎవ్వరికీ తెలియకుండా పలుకరించి వెళ్ళాడు.ఈ రోజు నా బ్రతుకులో ఈ కల్లోలం యేమిటో, హృదయంలో ఈ సంతోషపు స్పందనలేమిటో అర్థం కావడం లేదు.
నా విధులన్నీ పూర్తిచేసుకోవలసిన సమయం వచ్చేట్లుంది. ఒక అవ్యక్త మధుర పరిమళం గాలిలో తేలి వస్తోంది, నువ్వు ఇక్కడే ఉన్నావనిపిస్తూ!- రవీంద్రనాధ్ టాగోర్
― Gitanjali
జీవితపు ఆఖరు మజిలీ,
ఓ నా మృత్యువా, వచ్చి నాతో ఊసులాడు.ప్రతిదినం నేను నీ రాకకై ఎదురుచూస్తున్నా ప్రభూ,
నా జీవితపు ప్రమోదాలను జీవింపజేస్తూ.నేను, నా సర్వస్వం, బహుశా నా ప్రేమ
రహస్య అగాధాల వరకు నీ వైపు ప్రవహించాయి.ఒక్క నీ ఆఖరు వాలుచూపు...
నా జీవితం అంతా నీది.- రవీంద్రనాధ్ టాగోర్
I