పూనా వీధుల్లో, మందులు పట్టుకొనే తిరిగే మహనీయులు డాక్టర్ అభిజిత్ సోనావానే, మనీషా సోనావానే గురించి తెలుసుకోండి
![]() |
డాక్టర్ అభిజిత్ సోనావానే, అతని భార్య మనీషా సోనావానే |
డాక్టర్ అభిజిత్ సోనావానే, అతని భార్య మనీషా సోనావానే పూనా వీధుల్లో తిరుగుతుంటారు. పేదవారికి , బిచ్చగాళ్ళకి ఇళ్లు లేని నిరుపేదలు అనారోగ్యం తో మానసిక వైకల్యంతో కనిపిస్తే వారికీ ఉచితం వైద్యం చేసి మందులు పంపిణి చేస్తూ ఉంటారు . డాక్టర్ అభిజిత్ సోనావానే వయస్సు 43 సంవత్సరాలు. రోడ్ల మీద వైధ్య సాయం లేకుండా బిచ్చ మెత్తుకొనే వారికి వీరు ఉచిత వైద్యం చేస్తుంటారు.
వృద్దులు, అంగవైకల్యం ఉన్నవారు,కుటుంబం నుంచి వెలివేయ బడిన వారు తమ బ్రతుకు తెల్లవార్చు కోవడానికి బిచ్చమెత్తుకుంటారు . రాజకీయ నాయకులనుండి ఎటువంటి ప్రోత్సహం లేక ఎవరిని అడగాలో తెలియక ఆకలితో అలమటిస్తూ , వైద్య సాయం లేక రోడ్ల మీద కనబడిన వారి అందరికి వైద్య పరిక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు ఇస్తుంటారు. అతనికి ఆమె శ్రీమతి కూడా ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటుంది.
ప్రతి ఉదయం డాక్టర్ అభిజిత్ దేవాలయాలు,మసీదులు, చర్చిలు దగ్గరకి వెళ్లి ఎవరైనా ఇల్లు లేకుండా బిచ్చమెత్తుకుని బతుకుతున్న వాళ్ళను గుర్తిస్తారు. వారికి కావలసిన ఆరోగ్యం సహాయం మందులు అందిస్తుంటారు.
2017 వ సంవత్సరం నుండి వీళ్లు బిచ్చగాళ్ళకి వైద్య సహాయం ఆదించడం లోనే తన మునకలై ఉన్నారు. వారికీ ఆర్థిక సాయం కూడా చేసి స్వతంత్రం జీవితం గడపడానికి సహాయం చేస్తుంటారు. 2017 నుంచి ఇప్పటి వరకు 50 మంది వృద్దులు బిక్షాటన వదిలి వేసి సంపూర్ణ ఆరోగ్యం తో ఉంటూ స్వతంత్రముగా జీవనోపాధి కల్పించుకొనేందుకు అవకాశం కల్పించారు.
Sohan Trustను స్థాపించి దీనికి కావలసిన చందాలు సేకరిస్తున్నారు. trust ప్రాంభించక ప్రభుత్వ సహకారం తో మరింత విస్తరించి మురికి వాడల్లో వారికీ కుటుంబ పరిశుభ్రత విశదీకరిస్తూ 1,100 మంది భిక్షకులకు ఇప్పటి వరకు ఉచిత వైద్యం అందించారు.
డాక్టర్ అభిజిత్ తల్లితండ్రులు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు. వారు వారికి ఉన్నదంతా అభిజిత్ విద్యాభ్యాసానికై వెచ్చించారు. వారి కృషి ఫలించి 1999లో ఆయుర్వేదం లో బాచిలర్ డిగ్రీ అభిజిత్ సంపాదించారు.
Tilak Ayurved Mahavidyalaya లో ఆయుర్వేదం సర్జరీ లో డిగ్రీ సంపాదించినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం రాలేదు అలాగే చిన్న క్లినిక్ కూడా ఏర్పాటు చేసుకునే స్థితిలో కూడా లేడు. ఇంటింటికి తిరిగి వైద్యం చేయడం మొదలు పెట్టి కొంతమేరకు ఆర్థిక స్తోమతను సంపాదించుకొని పేదవారికి , బిచ్చగాళ్లకు ఉచిత వైద్యం చేయడం ప్రారంభించారు.
మొదట్లో ఇంటింటికి వైద్యం గురించి వాకబు చేసేటప్పుడు కొంతమంది ఇతన్ని అవమానించే వారు. ఇంత గౌరప్రదమైన వైద్య వృత్తి చేస్తూ ఇంటింటికి తిరిగి వైద్యం చేయవలసిన పనేముంది అని అడిగేవారు. కొంతకాలం అభిజిత్ కి 1 పూట భోజనానికి కూడా కష్టమయ్యేది. చాల వరకు చాలా చాల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు .
ఒకానొక సమయం లో ఉచిత వైద్యం మానేయడం మంచిది అనుకునేవాడు .అదే సమయం లో ఒకసారి తీవ్రం గా జబ్బు పడితే ఒక బిచ్చగత్తెల దంపతులు డాక్టర్ గారి కి సాయం చేసి సాధారణ స్థితికి వచ్చేలా చేసి అతనికి, అతనిని ఉచిత సేవ చేయడం మాన వద్దని మానసిక ధైర్యాన్ని ఇచ్చారు .
ఆ బిచ్చగాళ్ళు చేసిన సేవ ఇచ్చిన మనో దైర్యం తో అప్పటి నుంచి బిచ్చగాళ్ళకి సాయం చేయడం వదలలేదు . వాళ్ళు ఇచ్చిన సేవాభావం మానసిక స్ఫూర్తి తోనే నేను ఇప్పటివారు ఈ సేవ ని కొనసాగిస్తానని అభిజిత్ అంటున్నారు.
డాక్టర్ అభిజిత్ కి అంతర్జాతీయ సంస్థ లో పనిచేసే అవకాశం వచ్చింది. 10 సంవత్సరం అనంతరం, 2010వ సంవత్సరం లో ఉన్నట్టుండి నెలకి 3 లక్షల జీతం పొందే స్థాయికి ఎదిగారు. తర్వాత తన స్వగ్రామానికి వచ్చి తనకి సాయం చేసిన వృద్ధ దంపతుల గురించి వాకబు చేసి వైద్య సాయం, ఆర్థిక సాయం లేక వారు మరణించారని తెలిసి షాక్ కి గురయ్యాడు.
దహన ఖర్చులు కూడా వారికీ లేకుండానే కాలం చేసారని అక్కడి ప్రాంతీయులు చెప్పడం తో ఎక్కడో హృదయం కలిచి వేసింది. సమాజం లో ఉన్న లోపమేమిటో అర్దమైయింది. వారు తనకి కష్టకాలం లో చేసిన సాయం మర్చిపోలేక బిచ్చగాళ్ళు మానవులేనని వారికీ సాధారణ మానవత్వం ఉంటుందని గుర్తించి అప్పటి నుంచి సమయం వృధాచేయకుండా పేదవారికి సాయం చేయడం మొదలు పెట్టానని అతను చెబుతున్నారు.
కాలేజీ లో తనతో బాటు చదువుకున్న తన సహధర్మచారిణి అయిన మనీషా తనకి తన భి క్షకులకు ఉచిత వైద్యం ఆశయానికి చేయూత నివ్వడం నిజంగా అతని అదృష్టం. 2015 ఆగష్టు నుంచి తన ఉద్యొగానికి రాజీనామా చేసి తన ఆశయము కోసం పనిచేసి రోజు వచ్చింది. తమ ఉచితా సేవ కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేసి ఒక ఉచిత వైద్య సేవ కేంద్రము యోగ కేంద్రం స్థాపించారు.
బిక్షకులకు వ్యాపార మెళుకువలు ప్రతి సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10 గంటలు నుండి సాయంత్రం 4 గంటలు వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. అతను సంపాదించిన వనమూలికలు ఆయుర్వేద మందులు అమ్మి తన సేవ కేంద్రానికి తగిన నిధులు సమకూర్చుకుంటుంటాడు . అభిజీత్ మరియు అతని భార్య కలిసి 160 కంటి ఆపరేషన్లు ఉచితంగా భిక్షకులకు చేసారు.
ఒక సంవత్సరంలో 5 నెలలు పూర్తిగా బిక్షకుల ఆరోగ్యం గురించే పనిచేస్తాడు. అంతే కాకుండా వారి కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉంటూ వారి కష్టాలలో అండదండ గా ఉంటాడు. సాధ్యమైనంత వరకు వారు భిక్షక వృత్తి నుంచి బయట పడి స్వతంత్రం గా బతికేటందుకు చేతనైన సాయం చేస్తుంటాడు.
ఇతని ప్రోద్బలం తో చాల మంది తోపుడు బండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవితము కొనసాగిస్తున్నారు. కొంతమంది గాజులు అమ్మకం, కొంతమంది రోడ్డు పక్క చున్నీలు బనియన్స్ అమ్మడం లాంటి వాటికి ప్రోత్సాహం ఇచ్చాడు. చాల మందికి ఉచిత పెట్టుబడి కూడా పెట్టాడు.రెండుపూటలా కడుపునిండా తినడానికి తగిన సహాయ సహకారాలు అందించాడు.
అంతేకాకుండా తిరిగి భిక్షక వృత్తి లోకి రాననే మాట తీసుకొనే వారికీ ఆర్థిక సాయం చేస్తుంటాడు .ఆలా వస్తే గనుక ప్రత్యక్షం గా ఇంకా తిరిగి సహాయం చేయడు. ఎవిరికైనా రెకమండ్ చేసి నిధులు సమకూరుస్తుంటాడు.
వీరు చేసి సాయానికి నిజం గా మనం సలాం కొట్టాలి . ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు చాల అరుదుగా ఉంటారు. అందుకే వీరిని మహనీయులు గా వర్ణించవచ్చు . డాక్టర్ అభిజిత్ మరియు మనీషా లాంటి వారు మన సమాజానికి చాల అవసరం. వీరి సేవలకు ఆటంక కాకుండా ఎవరైనా వారికి అదనపు నిధులు సమకూరిస్తే వారు మరింత మందికి తమ సేవలను కోన సాగించడానికి అవకాశం కలుగుతుంది .
ఇటువంటి వారి వల్ల మన దేశం లో భిక్షకులనే వారే లేని దేశాన్ని మనం చూడడానికి అవకాశం కలుగుతుందనే ఆశిద్దాం. ప్రస్తుతం ఈ డాక్టర్ లు ఇద్దరు తమ సేవలు చాలామందికి విస్తరించాలనే ఉద్దేశంతో ఇద్దరు నిధులు, చందాలు సేకరిస్తున్నారు.
http://sohamtrust.com/
ఇతని గురించి ఇంకా తెలుసు కోవడానికి ఈ క్రింది వీడియో లింక్లు చూడండి ...
ఇతని గురించి ఇంకా తెలుసు కోవడానికి ఈ క్రింది వీడియో లింక్లు చూడండి ...
Pune Dr.Abhijeet Sonawane provides free treatment to ...
Meet Pune's 'Doctor for Beggar', who treats poor, homeless for ...
గమనిక :
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి .
అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe చేయండి.
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe చేయండి.
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.
No comments:
Post a Comment